IND vs NZ: లంకతో ఘోర పరాజయం.. భారత్‌తో టెస్ట్ సిరీస్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన కివీస్ కెప్టెన్..

|

Oct 02, 2024 | 11:30 AM

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌధీ ఆ దేశ క్రికెట్ అభిమానులకు సంచలన షాక్ ఇచ్చాడు. ఈ నెల బారత్‌తో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరగననుంది. అయితే తాజాగా టిమ్ సౌథీ సంచలన డెసిషన్ తీసుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసింది.

IND vs NZ: లంకతో ఘోర పరాజయం.. భారత్‌తో టెస్ట్ సిరీస్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన కివీస్ కెప్టెన్..
Tim Souttim Southee Steps D
Follow us on

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌథీ ఆ దేశ క్రికెట్ అభిమానులకు సంచలన షాక్ ఇచ్చాడు. ఈ నెల బారత్‌తో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరగననుంది. అయితే తాజాగా టిమ్ సౌథీ సంచలన డెసిషన్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్‌‌‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత నెలలో న్యూజిలాండ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసింది. ఈ సిరీస్ 2-0 తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.

దీంతో ఈ ఘోర ఓటమిని జీర్క్షించుకోలేకనే టిమ్ సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎంతో నచ్చిన టెస్ట్ ఫార్మట్‌‌లో న్యూజిలాండ్ టీమ్‌ను నడిపించడం తనకు తగ్గన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కివీస్‌ను అగ్రస్థానంలో ఉంచడానికి ట్రై చేసినట్లు చెప్పారు. ఇక నుంచి కూడా ప్లేయర్‌గా తన వంతు కృషి చేస్తానని చెప్పుకుచ్చారు. జట్టుకు మంచి జరగాలనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. గత ఏడాది కేన్ మామా న్యూజిలాండ్ కెప్టెన్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత టిమ్ సౌథీ కివీస్ పగ్గాలు చేపట్టాడు. సౌథీ కెప్టెన్సీలో 14 టెస్టులు మ్యచ్ జరగగా 6 మ్యాచ్‌లు కివీస్ విజయం సాధించింది. మొత్తంగా సౌథీ టీమ్‌ను బాగానే నడిపించగలిగాడు.

టిమ్ సౌథీ కివీస్ టెస్ట్ కెప్టెన్‌గా వైదొలుగుతున్న నేపథ్యంలో తుదిపరి కెప్టెన్‌‌గా కివీస్ వికెట్ కీపర్ టామ్ లాథమ్‌ను న్యూజిలాండ్ కికెట్ బోర్డు నియమించింది. ఈ నెల 16 నుంచి భారత్‌తో కివీస్ టెస్ట్ మ్యాచ్ తలపడబోతుంది. ఈ సిరీస్‌తో టామ్ లాథమ్ కెప్టెన్‌గా జర్నీ మొదటపెట్టబోతున్నాడు. ఈ టెస్ట్‌ సిరీస్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో ఈ నెల 10న కివీస్ భారత్‌కు రానున్నట్లు తెలుస్తుంది.