RCB vs PBKS: 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఆర్‌సీబీ ఓటమితో చరిత్ర సృష్టించిన కోహ్లీ ఫ్రెండ్
Royal Challenger Bengaluru: ఈ సీజన్‌లో ఆర్‌సీబీ 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బెంగళూరు జట్టు ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. బెంగళూరు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లను గెలచుకుఊంటూ పోతుండాలి. ముఖ్యంగా ఇంటి బయటే కాకుండా చిన్నస్వామిలో కూడా మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది.

Tim David Records: ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆర్‌సీబీ తమ సొంత మైదానంలో మరో ఓటమిని ఎదుర్కొంది. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు తన సొంత మైదానం చిన్నస్వామిలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆర్‌సీబీ ఖాతాలో ఈ ఓటమి ఉన్నప్పటికీ ఆ జట్టు తుఫాన్ బ్యాటర్ టిమ్ డేవిడ్ భారీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు మరే ఇతర బ్యాట్స్‌మన్ సాధించలేని రికార్డు అతని పేరు మీద నెలకొంది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, పంజాబ్ 13వ ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో పంజాబ్‌కు ఇది ఐదవ విజయం. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచినప్పటికీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ టిమ్ డేవిడ్‌కే దక్కింది.
ఐపీఎల్ 2025లో టిమ్ డేవిడ్ పేరిట భారీ రికార్డ్..
5️⃣ Awards, 1️⃣ Beast. 🥵
Thoroughly deserved! 👊#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #RCBvPBKS pic.twitter.com/7UZjKbYDWc
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 19, 2025
ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీని కారణంగా ఆర్‌సీబీ జట్టు సవాలుతో కూడిన స్కోరు చేయడంలో విజయవంతమైంది. టిమ్ డేవిడ్ లేకపోతే బెంగళూరు భారీ స్కోరు సాధించలేకపోయేది. ఈ కారణంగానే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలైనప్పటికీ, టిమ్ డేవిడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పుడు టిమ్ డేవిడ్ ఐపీఎల్ 2025 లో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బెంగళూరు జట్టు ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. బెంగళూరు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లను గెలచుకుఊంటూ పోతుండాలి. ముఖ్యంగా ఇంటి బయటే కాకుండా చిన్నస్వామిలో కూడా మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో తమ సొంత మైదానంలో బెంగళూరు జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




