WIPL 2023: మహిళల ఐపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన 5గురు.. లిస్టులో భారత్ నుంచి ఇద్దరు?

| Edited By: Ravi Kiran

Jan 21, 2023 | 8:47 AM

WIPL 2023 Auction: మహిళల ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌లలో 2వ స్థానంలో నిలిచింది. కాగా, ఈ తొలి సీజన్ మార్చిలో అలరించేందుకు సిద్ధమైంది.

WIPL 2023: మహిళల ఐపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన 5గురు.. లిస్టులో భారత్ నుంచి ఇద్దరు?
Woman Ipl
Follow us on

6 జట్లు పాల్గొనే మొట్టమొదటి మహిళల ఐపీఎల్.. మార్చిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైది. ఈ క్రమంలో జనవరి 25న బీసీసీఐ పూర్తి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. ఆయా ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ, విదేశీ ప్లేయర్లతోపాటు దేశీ ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించనుంది. దీంతో ఉమెన్స్ ఐపీఎల్ వేలం మొదలుకానుంది. కాగా, WIPL మీడియా హక్కులు ఇప్పటికే Viacom 18కి విక్రయించారు. ఫ్రాంచైజీ యాజమాన్య వేలం జనవరి 25న జరగనుంది. పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలైన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ WIPL జట్ల కోసం వేలంలో పాల్గొంటాయి. ఈ క్రమంలో త్వరలో జరగబోయే WIPL 2023 వేలంలో ఎవరు అత్యంత ఖరీదుగా మారనున్నారోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

యువ ప్లేయర్లకు గోల్డెన్ ఛాన్స్..

తొలిసారిగా మహిళల ఐపీఎల్ జరగనుంది. ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళల ఐపీఎల్‌లో చాలా మంది యువ ప్లేయర్లకు అవకాశం కల్పించనున్నారు. క్యాష్ రిచ్ లీగ్‌లో సీనియర్లకే కాదు.. యువతకు కూడా భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ తొలి మహిళల ఐపీఎల్‌లో భారత టీ20 స్టార్లు మంధాన, జెమీమా, హర్మన్‌ప్రీత్ మొత్తం 6 ఫ్రాంచైజీల దృష్టిలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్లతో పాటు అగ్రశ్రేణి ఓవర్సీస్ ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొననున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పరిగణలోకి తీసుకుంటే.. ఉమెన్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదుగా మారే 5గురు ఆటగాళ్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.

ఇవి కూడా చదవండి

WIPL 2023 వేలంలో అత్యంత ఖరీదుగా మారనున్న 5గురు ఆటగాళ్లు వీరే..

1. స్మృతి మంధాన (భారత్)

టీమిండియా ఉమెన్స్ జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్‌గా పేరుగాంచిన మంధాన.. మహిళల ఐపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన బిడ్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ సామర్థ్యంతో పాటు స్మృతికి భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇది ఫ్రాంచైజీకి బలమైన అభిమానులను సంపాదించడంలో సహాయపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2. షఫాలీ వర్మ (భారత్)

టీమిండియా ఉమెన్స్ టీంలో తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన యువ బ్యాటర్ షెఫాలీ వర్మ.. ఈ లిస్టులో నిలిచే అవకాశం ఉంది. అరంగేట్రంలోనే లేడీ సెహ్వాగ్‌లా పేరు పొందిన షెఫాలీ.. తన విధ్వంసక బ్యాటింగ్‌తో టీ20 ఫార్మాట్‌లో తన పేరును ప్రత్యేకంగా నిలిచేలా చేసుకుంది. దీంతో ప్రతి ఫ్రాంచైజీ ఆమెను దక్కించుకోవాలని కోరుకుంటున్నాయి.

3. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్‌లో సత్తాచాటుతోన్న ఎల్లీస్ పెర్రీ.. అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకరిగా పేరుగాంచింది. త్రీ-డైమెన్షనల్ ప్లే మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా జట్టు కోసం ఆటను మార్చగలదు. అలాగే సారథిగానూ టోర్నీలో జట్టును నడిపించగల సమర్థురాలిగా పేరుగాంచింది. ఈ లక్షణాలతో అన్ని జట్లను తన వైపునకు తిప్పుకునేలా చేసింది.

4. అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా)

ఎంతో అనుభవం ఉన్న అలిస్సా హీలీ కూడా ఉమెన్ ఐపీఎల్ వేలంలో భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశం ఉంది. టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతికొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరిగా నిలిచింది. అలాగే బలమైన ఓపెనర్‌గానూ సత్తా చాటడంతో ప్రతీ జట్టు ఆమెను దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిలు వేసుకుంటున్నాయి.

5. నాట్ స్కివర్ (ఇంగ్లండ్)

30 ఏళ్ల ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ నాట్ స్కివర్‌కు కూడా తొలి మహిళల ఐపీఎల్ వేలంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఆమె బ్యాట్‌తో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, జట్టుకు చాలా విజయాలు అందించింది. ఇంగ్లీష్ జట్టు ప్రధాన ప్లేయర్లలో ఒకరిగా దూసుకపోతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..