టాలెంట్ బారెడంత.. దురదృష్టం చారెడంత.. టీమిండియాలో ఈ ముగ్గురి కెరీర్ ఇక శూన్యమే.!

కొందరి ప్లేయర్స్‌కు టాలెంట్ బారెడంత ఉంటే.. దురదృష్టం చారెడంత ఉంటుంది. ఎంత టాలెంట్ ఉంటే.. ఏం లాభం.. దురదృష్టంతో అవకాశాలు అస్సలు దరికి చేరట్లేదు. తద్వారా వారి ఆశలు అడియాసలు అయిపోవడమే. సరిగ్గా ఇలాంటి కోవకు చెందారు ముగ్గురు ఆటగాళ్లు. వీళ్లకు వచ్చిన అవకాశాలు కొద్దోగొప్పో అయితే..

టాలెంట్ బారెడంత.. దురదృష్టం చారెడంత.. టీమిండియాలో ఈ ముగ్గురి కెరీర్ ఇక శూన్యమే.!
Team India

Updated on: Sep 08, 2023 | 12:24 PM

కొందరి ప్లేయర్స్‌కు టాలెంట్ బారెడంత ఉంటే.. దురదృష్టం చారెడంత ఉంటుంది. ఎంత టాలెంట్ ఉంటే.. ఏం లాభం.. దురదృష్టంతో అవకాశాలు అస్సలు దరికి చేరట్లేదు. తద్వారా వారి ఆశలు అడియాసలు అయిపోవడమే. సరిగ్గా ఇలాంటి కోవకు చెందారు ముగ్గురు ఆటగాళ్లు. వీళ్లకు వచ్చిన అవకాశాలు కొద్దోగొప్పో అయితే.. దాన్ని కష్టపడి సద్వినియోగం చేసుకుంటే.. చివరికి మెగా టోర్నమెంట్లకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సంచలనాలు లేకుండా.. ఆసియా కప్‌లో ఆడే ప్లేయర్స్‌నే చాలావరకు ప్రపంచకప్ జట్టులో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఆసియా కప్‌కు సెలెక్ట్ అయిన ముగ్గురు ఆటగాళ్లకైతే భంగపాటు తప్పలేదు. గత కొంతకాలంగా జట్టులో చోటు దక్కించుకునేందుకు నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ఆ ముగ్గురు ప్లేయర్స్‌కు.. బీసీసీఐ సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు. వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయకుండా.. వారి ఆశలను అడియాసలు చేశారు. మరి ఇంతకీ ఆ త్రీ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..

సంజూ శాంసన్:

వన్డే ఫార్మాట్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్న సంజూ శాంసన్.. మొన్నటికి మొన్న వెస్టిండీస్ టూర్‌లోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఇతడు నిలకడైన ప్రదర్శన కనబరచకపోవడంతో.. సెలెక్టర్లు ఈ ఆసియా కప్ బ్యాకప్ ప్లేయర్‌ను వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయలేదు. అలాగే వరుసగా టీ20 సిరీస్‌లో ఫెయిల్ కావడం.. సెలెక్టర్ల ఎంపికపై ప్రభావం చూపించింది. ఇప్పటిదాకా శాంసన్ వన్డేల్లో 12 ఇన్నింగ్స్‌లలో 55.71 యావరేజ్, 104 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

వాషింగ్టన్ సుందర్:

ఈ ఆఫ్ స్పిన్నర్‌కు కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. గత కొంతకాలంగా వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచట్లేదు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఈ ఆల్‌రౌండర్ అటు బ్యాట్.. ఇటు బంతితో ఆకట్టుకుంటున్నప్పటికీ.. గాయాలు చుట్టుముట్టాయి. ఇప్పటిదాకా వాషింగ్టన్ సుందర్.. 15 వన్డే మ్యాచ్‌లు ఆడి 233 పరుగులు చేయడంతో పాటు.. 15 వికెట్లు పడగొట్టాడు.

ప్రసిద్ద్ కృష్ణ:

ఈ యువ పేస్ బౌలర్.. గత కొంతకాలంగా ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్నాడు. 14 వన్డేలు ఆడిన ప్రసిద్ద్ కృష్ణ 5.32 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు మేజర్ టోర్నమెంట్లు మిస్ చేసుకున్న ప్రసిద్ద్.. దీని వల్లే ప్రపంచకప్ 2023 జట్టులో కూడా స్థానం దక్కించుకోలేకపోయాడు.

వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ జట్టు ఇదే:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నారు.