1 బంతికి 22 పరుగులు.. ఏం తాగి కొడతారు బ్రో.. క్రికెట్ చరిత్రలో అన్‌లక్కీ మ్యాచ్ ఇదే.!

1992 క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి క్రికెట్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరిగింది. దక్షిణాఫ్రికా గెలవాలంటే 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. కీలక సమయంలో వర్షం కారణంగా ఆట 12 నిమిషాల పాటు నిలిచిపోయింది.

1 బంతికి 22 పరుగులు.. ఏం తాగి కొడతారు బ్రో.. క్రికెట్ చరిత్రలో అన్‌లక్కీ మ్యాచ్ ఇదే.!
Sa Vs Eng

Updated on: Jan 29, 2026 | 8:06 AM

1992 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా వర్షం కారణంగా వివాదాస్పదంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన టార్గెట్, ఆట నిలిచిపోయిన 12 నిమిషాల తర్వాత ఒక్క బంతికి 22 పరుగులుగా మారింది. ఈ అసాధారణ టార్గెట్ చేంజ్ క్రికెట్ చరిత్రలో ఒక దురదృష్టకర సంఘటనగా నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే..! 1992 క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి క్రికెట్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరిగింది. దక్షిణాఫ్రికా గెలవాలంటే 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. కీలక సమయంలో వర్షం కారణంగా ఆట 12 నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

ఆట తిరిగి ప్రారంభం అయిన తర్వాత, మ్యాచ్ నిర్వాహకులు దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఊహించని విధంగా మార్చారు. 13 బంతుల్లో 22 పరుగులు అనే టార్గెట్ ఒక్క బంతికి 22 పరుగులుగా మార్చి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఈ నిర్ణయంపై అప్పట్లో బోలెడన్ని విమర్శలు వచ్చాయి. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కూడా అంపైర్ల వద్దకు వచ్చి ఈ మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే, చివరికి అంపైర్ల నిర్ణయమే అమలులోకి వచ్చింది. ఫలితంగా, దక్షిణాఫ్రికా ఒక్క బంతికి 22 పరుగులు చేయలేక ఆ మ్యాచ్‌లో ఓడిపోయి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. కేవలం 12 నిమిషాల ఆట నిలిచిపోయినందుకు, బంతుల సంఖ్యను గణనీయంగా తగ్గించి, పరుగుల సంఖ్యను తగ్గించకపోవడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద నిర్ణయాలలో ఒకటిగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..