
Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలోకి మరో యువ సంచలనం అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భాగంగా నవంబర్ 14న యూఏఈ పై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 42 బంతుల్లో ఏకంగా 144 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో బౌండరీల కంటే సిక్స్‌లే ఎక్కువ కొట్టడం విశేషం. ఇంత చిన్న వయసులో వైభవ్ కొట్టే లాంగ్ సిక్స్‌ల వెనుక ఉన్న సీక్రెట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నవంబర్ 14న యూఏఈతో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ పేలుడుకు పర్యాయపదంగా నిలిచింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన వైభవ్, 342.85 స్ట్రైక్ రేట్‌తో కేవలం 42 బంతుల్లో 144 పరుగులు చేసి యూఏఈ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 11 ఫోర్లు కొట్టగా, ఏకంగా 15 భారీ సిక్స్‌లను కొట్టడం గమనార్హం. ఈ గణాంకాలు వైభవ్ అసాధారణమైన పవర్-హిట్టింగ్ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి.
ఇంత చిన్న వయసులో వైభవ్ కొట్టే లాంగ్ సిక్స్‌ల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటా అని చూస్తే, అది ఆయన కాళ్లలో ఉంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి సహజంగానే స్ట్రాంగ్, హెవీ తొడలు ఉన్నాయి. దీంతో పాటు, ఆయన గ్లూట్ కండరాలు చాలా పెద్దగా, పవర్ఫుల్ గా ఉన్నాయి. ఈ కండరాల నుంచే వైభవ్‌కు బంతిని అత్యంత దూరం పంపడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాళ్లలోని ఈ అసాధారణమైన బలం వల్లే ఆయన సిక్స్‌లు సులభంగా కొట్టగలుగుతున్నారు.
స్ట్రాంగ్ కాళ్ల శక్తితో పాటు, వైభవ్ చేతులు కూడా చాలా గట్టిగా ఉండటం వల్ల బ్యాట్‌ను గట్టిగా పట్టుకుని, బంతిని వేగంగా దూరం పంపగలుగుతున్నారు. యూఏఈతో వైభవ్ ఆడిన ఈ మ్యాచ్, భారత జెర్సీలో ఆయనకు ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం విశేషం. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ స్థాయిలో సంచలనం సృష్టించిన వైభవ్, రాబోయే మ్యాచ్‌లకు తనదైన శైలిలో మార్గాన్ని సుగమం చేసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..