IND vs PAK: వర్షంతో మొదలుకాని ఛేజింగ్.. 20 ఓవర్లలో పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే?

Pakistan vs India: ఆసియాకప్‌లో భాగంగా 3వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ముందు 267 పరుగుల టార్గెట్ నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 87, ఇషాన్ కిషన్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ఈ మాత్రం స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్స్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. భారత్ వికెట్లన్నీ […]

IND vs PAK: వర్షంతో మొదలుకాని ఛేజింగ్.. 20 ఓవర్లలో పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే?
Ind Vs Pak Pallekele Weather Report

Updated on: Sep 02, 2023 | 9:36 PM

Pakistan vs India: ఆసియాకప్‌లో భాగంగా 3వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ముందు 267 పరుగుల టార్గెట్ నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 87, ఇషాన్ కిషన్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ఈ మాత్రం స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్స్ అంతా ఘోరంగా విఫలమయ్యారు.

భారత్ వికెట్లన్నీ పాక్ ఫాస్ట్ బౌలర్లే తీయడం గమనార్హం. లెఫ్ట్ హ్యాండ్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రవూఫ్, నసీమ్ షా చెరో 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం ఆలస్యం అయింది. గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పబడి ఉంది. ప్రస్తుతానికి వర్షం పడుతూనే ఉంది. అంపైర్లు 9:00 గంటలకు మైదానాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో తగ్గినట్టే తగ్గి, మరోసారి వర్షం ప్రారంభమైంది. కాగా, తొలి ఇన్నింగ్స్ సమయంలోనూ వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. రాత్రి 7:44 గంటలకు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ప్రకారం రెండవ ఇన్నింగ్స్ రాత్రి 8:14 గంటలకు ప్రారంభం కావాలి. కానీ ఇంకా ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు.

వర్షంపై బీసీసీఐ ట్వీట్..

వర్షం కారణంగా ఓవర్లు తగ్గితే పాకిస్థాన్ కొత్త లక్ష్యం ఎలా ఉండనుందంటే?

45 ఓవర్ల ఆట సాగితే లక్ష్యం 254 పరుగులు.

40 ఓవర్ల ఆట సాగితే లక్ష్యం 239 పరుగులు.

30 ఓవర్ల ఆట సాగితే లక్ష్యం 203 పరుగులు.

20 ఓవర్ల ఆట సాగితే లక్ష్యం 155 పరుగులు.

ఇరుజట్ల ప్లేయింగ్ XI

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..