Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..

Kevin Pietersen praise on PM Narendra Modi: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో ప్రశంసలు

Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..
Kevin Pietersen Pm Narend

Updated on: Nov 30, 2021 | 8:17 AM

Kevin Pietersen praise on PM Narendra Modi: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 సంక్షోభం మధ్య ఆఫ్రికన్ దేశాల పట్ల భారత్ సాయం, నిబద్ధతను చూసి పీటర్సన్ సంతోషం వ్యక్తంచేశాడు. భారత్ అత్యంత అద్భుతమైన దేశమంటూ కొనియాడాడు. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. 18 నెలల తర్వాత ఈ సంక్షోభం నుంచి ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటుందన్న సమయంలో దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్‌ వెలుగులోకి రావడం మరోసారి ఆందోళనకు దారితీసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ను ‘ఓమిక్రాన్’ వైరస్‌గా పేరు పెట్టింది. ఈ కొత్త వేరియంట్‌తో కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతుందన్న హెచ్చరికలతో ప్రపంచం భయాందోళన చెందుతోంది. ఒమిక్రాన్ ప్రమాదం పొంచివుండటంతో ఇప్పటికే చాలా దేశాలు కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలో ‘ఓమిక్రాన్’ మొదటి కేసును నివేదించడంతో.. చాలా దేశాలు ప్రయాణ నిషేధాలు, ఇతర ఆంక్షల విధించడంతో ఆఫ్రికా దేశాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ.. భారత్ ఆఫ్రికా ఖండానికి సహాయం చేయడానికి ముందడుగు వేయడంపై పీటర్సన్ సంతోషం వ్యక్తంచేస్తూ ట్విట్ చేశాడు. భారత్ చేసిన ప్రకటనను రీట్విట్ చేస్తూ ప్రధాని మోదీని ప్రశంసించాడు. ‘ఓమిక్రాన్’ ప్రమాదంలో ఉన్న ఆఫ్రికాలోని దేశాలకు భారత్ సహాయానికి సంబంధించిన ట్విట్‌కు పీటర్సన్ రీట్విట్ చేశాడు. ఈ సందర్భంగా పీటర్సన్ ట్వీట్ చేస్తూ.. ‘‘భారత్ మరోసారి ఆ కేరింగ్ స్పిరిట్‌ను చూపింది… అందుకే చాలా మంది హృదయపూర్వక వ్యక్తులతో అత్యంత అద్భుతమైన దేశంగా నిలించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు’’ అంటూ పీటర్సన్ ట్విట్‌లో రాశాడు.

పీటర్సన్ ట్విట్..

కాగా.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఆఫ్రికన్ దేశాలకు ‘మేడ్-ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌లను సరఫరా చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. “ఒమిక్రాన్ వేరియంట్‌తో బాధపడుతున్న ఆఫ్రికాలోని దేశాలకు మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్‌ల సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ కోవాక్స్ కార్యక్రమం ద్వారా లేదా ద్వైపాక్షికంగా సరఫరా చేయడం జరుగుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

Also Read:

Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Corona – Omicron: ఒమిక్రాన్ విషయంలో ఊరట కలిగించే న్యూస్ చెప్పింది సౌతాఫ్రికా.. అదేంటంటే..