PSL 2021: పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్‌లీగ్ ) 2021లో పాకిస్తాన్ ఆటగాళ్లు రచ్చ చేశారు. కోపంతో ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. చివరికి అంపైర్లు రంగంలోకి దిగి వారిని దూరంగా పంపించి గొడవను శాంతింపజేశారు. ప్రశాంతంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, యువ ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది ఒకరినొకరు దూషించుకుంటూ ఒక్కసారిగా స్టేడియంలో హీట్ పెంచేశారు. క్వెటా గ్లాడియేటర్స్, లాహోర్ ఖలండర్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఈ గొడవ జరిగింది. అఫ్రిది బౌలింగ్ లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, అఫ్రిది విసిరిన బౌన్సర్ సర్ఫరాజ్ హెల్మెట్‌కి బలంగా తగిలింది. దీంతో సహనం కోల్పోయిన పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ ఆవేశంతో అసభ్య పదజాలంతో ఊగిపోయాడు. దీనికి షాహిన్ అఫ్రిది కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. పరిస్థితిని గమనించిన అంపైర్లు, సహచర ఆటగాళ్లు వెంటనే అక్కడకు చేరుకుని గొడవ మరింత పెద్దది కాకుండా ఇద్దరిని శాంతింపచేశారు.
అసలేం జరిగింది..
ఈ మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేటర్స్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ లో 19వ ఓవర్‌ను బౌలర్ షాహిన్ షా అఫ్రిది వేస్తున్నాడు. అయితే ఆఖరి బంతిని 147కిమీ వేగంతో బౌన్సర్ వేశాడు. కాగా, బంతిని ఫుల్ చేసేందుకు సర్ఫరాజ్ అహ్మద్ ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి నేరుగా వెళ్లి సర్ఫరాజ్ హెల్మెట్‌కి బలంగా తగిలి, థర్డ్ మ్యాన్ దిశగా కదిలింది. దీంతో సర్ఫరాజ్ పరుగు కోసం ప్రయత్నిస్తూ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి చేరుకున్నాడు. అక్కడే ఉన్న షాహిన్ అఫ్రిదితో గొడవకి కాలు దువ్వాడు. బౌన్సర్ వేస్తావా? అన్నట్లుగా కోపంతో షాహిన్ వైపు చూశాడు. దీంతో అలాంటి పరిస్థితిని ఊహించని షాహిన్.. సర్ఫరాజ్ మాటలకు గట్టిగానే ఆన్సర్ ఇస్తూ.. సర్ఫరాజ్ వైపు కదిలాడు. గొడవ పెద్దది కాకుండా సహచర ఆటగాళ్లు, ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకున్నారు. సర్ఫరాజ్, షాహిన్‌లకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా, షాహిన్ చేసిన పనికి నెటిజన్లు, పాకిస్తాన్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం లాహోర్ ఖలందర్స్ కేవలం 18 ఓవర్లలో140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 18 పరుగుల తేడాతో క్వెటా గ్లాడియేటర్స్ విజయం సాధించారు.
When you know Sarfaraz is no longer the skipper of Pakistan! ??#PSL6 | #LQvQG | #QGvLQ pic.twitter.com/M2JyDpYDQ8
— Daniyal Mirza (@Danitweets__) June 15, 2021
Also Read:
భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.
WTC Final: అయ్యో.. ఆ రోజు వర్షం పడితే..! టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేత ఎవరు..!