Shikhar Dhawan: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. యూఏఈ, ఒమన్‌లో జరగనున్న పొట్టి ప్రపంచ కప్‌లో ఈ జట్టు పాల్గొననుంది. ఎంఎస్ ధోనీ మెంటార్‌గా ఈ టోర్నమెంట్‌లో జట్టుకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ధోనీ జట్టుతో చేరడం చాలా మందికి ఆనందం కలిగించింది. అలాగే టీంలో సెలక్ట్ కానీ సభ్యుల జాబితా కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందులో ముఖ్యమైన ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిది మ్యాచుల్లో 54.28 సగటుతో 380 పరుగులు సాధించాడు.
ధావన్ 2020 ఐపీఎల్‌లో అత్యధిక పరుగలు చేసిన వారి జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ 670 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ధవన్ రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో సహా 44.14 సగటుతో 618 పరుగులు బాదేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల పర్యటనలో భారతదేశానికి నాయకత్వం వహించాడు. టీమిండియా వన్డేల్లో 2-1 విజయాన్ని నమోదు చేసింది. టీ 20 ల్లో 1-2 తేడాతో ఓడిపోయింది. అయితే ఈ రెండు మ్యాచులకు కీలక ప్లేయర్లు అందుబాటులో లేరు. కృనాల్ పాండ్యకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో అతనితో సన్నిహితంగా ఉన్న మరో ఏడుగురిని ఐసోలేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో పొట్టి సిరీస్‌ను ఓడిపోవాల్సి వచ్చింది.
సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ.. ధావన్‌ను సెలక్ట్ చేయకపోవడంపై ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనలేదు. అయితే ధవన్ మాత్రం మా పరిశీలనలోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
“శిఖర్ మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. సమావేశంలో జరిగిన చర్చను బహిర్గతం చేయలేం. అతను మా పరిశీనలోనే ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ధవన్‌కు విశ్రాంతి అవసరమని మేం భావించాం ” అని సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ వర్చువల్ ప్రెస్ మీట్‌లో తెలిపాడు.
జట్టు ఓపెనింగ్ పెయిర్‌పై శర్మ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటే చెప్పలేం. ముఖ్యంగా, ఈ ఏడాది ప్రారంభంలో అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో కోహ్లీ-రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. టీ 20 వరల్డ్ కప్ కోసం మరోసారి అలాంటి పాత్ర పోషిస్తే మంచిదే” అంటూ వివరించాడు.
మరోవైపు చాహల్‌ను పక్కన పెట్టడంపై ప్రధాన కారణాన్ని వెల్లడించాడు. “త్వరగా బౌలింగ్ చేసే స్పిన్నర్లకే మా ప్రాధాన్యతనిచ్చాం. అందువల్ల, మేం రాహుల్ చాహర్‌ను సెలక్ట్ చేశాం. మిస్టరీ బౌలర్‌గా వరుణ్ చక్రవర్తికి అవకాశం కల్పించాం ” అని తెలిపాడు.
Also Read: India’s T20 World Cup Squad: ఈ 15 మంది ఆటగాళ్ల ప్రత్యేకతలేంటో తెలుసా..?
T20 World Cup: పొట్టి ఫార్మాట్‌కు దూరమైన ఆటగాళ్లు.. ఇంటికే పరిమితం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా ఇదే.. జట్టుకు మెంటార్‌గా ధోని..