ENG vs IND: బ్రాడ్‌మన్‌ తర్వాతి స్థానంలో టీమిండియా ఓపెనర్.. ద్రవిడ్ రికార్డునూ బ్రేక్ చేసిన రోహిత్

|

Sep 05, 2021 | 7:25 PM

విదేశాల్లో జరిగిన టెస్టుల్లో తొలిసారి శతకం బాదిన హిట్ మ్యాన్.. ఇంగ్లండ్‌ గడ్డపై ఓ అరుదైన రికార్డును చేరుకున్నాడు.

ENG vs IND: బ్రాడ్‌మన్‌ తర్వాతి స్థానంలో టీమిండియా ఓపెనర్.. ద్రవిడ్ రికార్డునూ బ్రేక్ చేసిన రోహిత్
Rohit Sharma
Follow us on

Rohit Sharma: ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగోటెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. అయితే రెండో ఇన్నింగ్స్‌తో హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ అద్భుత సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. విదేశాల్లో జరిగిన టెస్టుల్లో తొలిసారి శతకం బాదిన హిట్ మ్యాన్.. ఇంగ్లండ్‌ గడ్డపై ఓ అరుదైన రికార్డును చేరుకున్నాడు. ఇంగ్లండ్‌ దేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వతకాలు సాధించిన జాబితాలో టీమిండియా ఓపెనర్ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 9 సెంచరీలు బాదేశాడు. అయితే ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆసీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ నిలిచాడు. 11 సెంచరీలతో బ్రాడ్ మన్ తొలి స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ 9 సెంచరీలతో నిలిచాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్‌ శర్మ, విండిస్ దిగ్గజం రిచర్డ్స్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో టీమిండియా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 8 సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ద్రవిడ్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ.. రిచర్డ్స్‌తో కలిసి రెండో స్థానం చేరుకున్నాడు.

ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు ఆటలో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం టీమిండియా 6వికెట్ల నష్టానికి 375 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్‌పై 276 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రిషబ్ పంత్(37), శార్దుల్(36)పరుగులతో కీలక భాగస్వాన్ని ఏర్పరిచారు. దీంతో నాలుగో రోజు భారత్.. టీమిండియాపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

Also Read: KL Rahul: కేఎల్ రాహుల్‌కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో15 శాతం విధిస్తూ నిర్ణయం.. ఎందుకో తెలుసా..?

IND vs ENG: ఐసోలేషన్‌లో టీమిండియా హెడ్‌కోచ్.. కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ.. మరో ముగ్గురు సభ్యులు కూడా..!

IND vs ENG 4th Test Day 4 Live: 50 పరుగుల కీలక భాగస్వామ్యం.. పంత్ 37, శార్దుల్ 33 బ్యాటింగ్.. 270 దాటిన టీమిండియా ఆధిక్యం