India Vs Srilanka: ఇండియా వెర్సస్ శ్రీలంక.. షెడ్యూల్ ఇదే.. కెప్టెన్‌గా ధావన్.?

జూలై నెలలో టీమిండియా శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. జూలై 13 నుంచి 25..

India Vs Srilanka: ఇండియా వెర్సస్ శ్రీలంక.. షెడ్యూల్ ఇదే.. కెప్టెన్‌గా ధావన్.?
Dhawan

Updated on: Jun 08, 2021 | 8:23 AM

జూలై నెలలో టీమిండియా శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. జూలై 13 నుంచి 25 మధ్య ఇరు జట్లు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లు జరిగే వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.

ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా.. లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు లంక పర్యటనకు వెళ్లనుంది. ఇక ఈ జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?