IND vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియాలో కీలక మార్పులు.. ఈ వారంలో జట్టు ప్రకటన..!

|

Jan 25, 2022 | 11:03 AM

Team India: భారత పర్యటనలో ఉన్న కరీబియన్ జట్టు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ చేరుకోనుంది. కాగా ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది.

IND vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియాలో కీలక మార్పులు.. ఈ వారంలో జట్టు ప్రకటన..!
Ind Vs Wi
Follow us on

India vs West Indies: దక్షిణాఫ్రికా టూర్‌లోని చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ప్రస్తుతం టీమిండియా ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. భారత జట్టు(Indian Cricket Team) స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడాల్సిన తదుపరి సిరీస్‌పై ఫోకస్ చేయాల్సి ఉంది. భారత పర్యటనలో వెస్టిండీస్(India vs West Indies) జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది . ఈ పర్యటన ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం ఈ వారంలో టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్పోర్ట్స్ టైగర్ నివేదిక మేరకు ఈ సమాచారం వచ్చింది. దక్షిణాఫ్రికాలో టీమిండియా ప్రదర్శన చూస్తుంటే స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

స్నాయువు గాయం కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లని కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇది కాకుండా, రవీంద్ర జడేజా కూడా జట్టులోకి తిరిగి రావడాన్ని చూడవచ్చు. జడేజా కూడా గాయంతో బెంగళూరులోని NCAలో రోహిత్‌తో కలిసి శిక్షణ పొందుతున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు పునరాగమనం చేయడంతో పాటు, జట్టు బౌలింగ్ ఆర్డర్‌లో పెను మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంది.

భారతదేశంలోని 2 మైదానాల్లోనే మ్యాచులు..
భారత పర్యటనలో వెస్టిండీస్ టీం ముందు 6 వేర్వేరు వేదికల్లో ఆడాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా, మ్యాచ్‌లను పలు వేదికలలో నిర్వహించే బదులు కేవలం 2 వేదికల్లోనే బీసీసీఐ నిర్వహించనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అదే సమయంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత పర్యటనలో ఉన్న కరీబియన్ జట్టు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ చేరుకోనుంది.

భారత పర్యటనలో వెస్టిండీస్ షెడ్యూల్..
సిరీస్‌లో తొలి వన్డే ఫిబ్రవరి 6న జరగనుంది. దీని తర్వాత మిగిలిన 2 మ్యాచ్‌లు ఫిబ్రవరి 9, 11 తేదీల్లో జరగనున్నాయి. ఐదు రోజుల విరామం తర్వాత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 ఫిబ్రవరి 16న, రెండో మ్యాచ్ ఫిబ్రవరి 18న, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 20న జరగనుంది.

Also Read: Watch Video: చివరి ఓవర్లో హైడ్రామా.. హ్యాట్రిక్‌తో బౌలర్ దూకుడు.. 6 పరుగుల కోసం బ్యాటర్ల పోరు..!

T20 Records: 5000 పరుగులు, 400 వికెట్లు.. టీ20 రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న ఆల్‌రౌండర్..!