Mohammed Kaif: వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. మరోవైపు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి పలువురు క్రికెటర్లు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఇటీవలే కోలుకున్న జస్ప్రీత్ బూమ్రా పునరాగమనంలోనే ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ కోసం పర్యటించే భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సర్జరీ తర్వాత అంటే దాదాపు ఏడాది తర్వాత అతను ఆడబోయే తొలి సిరీస్ ఇది. బూమ్రా ఆటకు దూరం కావడంతో ఆ ప్రభావం ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పైన.. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పైన బాగానే పడింది. ఈ నేపథ్యంలోనే బూమ్రా గురించి టీమిండియా మాజీ ప్లేయర్, మిస్టర్ డిపెండబుల్ మొహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మాదిరిగానే.. 2023 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా బూమ్రా లేకుండా బరిలోకి దిగితే భారత్ కష్టాల పాలవుతుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
కైఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ టైటిల్ బరిలో భారత్ అవకాశాలు గాయపడిన ఆటగాళ్ల పునరాగమనంపైనే అధారపడి ఉంటుంది. చాలా కాలం తర్వాత బూమ్రా జట్టులోకి తిరిగి వస్తున్నాడు. అతను ఎంత ఫిట్‌గా ఉన్నాడో ఓ అవగాహన(ఐర్లాండ్ సిరీస్ ద్వారా) వస్తుంది. భారత్‌లోనే జరిగే వన్డే ప్రపంచకప్‌లో అతను టీమిండియాకు చాలా అవసరం. అతను ఇక్కడ రాణించగలడు. బూమ్రా లేకుంటే ఆసియకప్, 2022 టీ20 వరల్డ్‌కప్ ఓడినట్లుగానే వన్డే వరల్డ్‌కప్ కూడా ఓడిపోతాం. అప్పుడు అతను జట్టులో లేడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌తో సహా కీలక ఆటగాళ్లు అందుబాటులో లేరు. వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను ప్రయోగాత్మకంగా ఆడుతూ కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దానిపై నేను మాట్లాడను. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటే జట్టులో భాగం చేయకుండా ఉండాలి. ఏదేమైనా వారి ఆట గురించి ఆసియా కప్ తర్వాత మాట్లాడగలను. వారు ఎలాంటి సప్పోర్ట్ అందిస్తారో కచ్చితంగా తెలుసుకోవాల’ని కైఫ్ చెప్పుకొచ్చాడు.
Mohammed Kaif said, “If Bumrah does not play then we can lose the World Cup”#Cricket #CricketNews #Mohammedkaif #JaspritBumrah #TeamIndia #IndianCricketTeam #WorldCup #WorldCup2023 pic.twitter.com/xwy8zkWeuo
— CricInformer (@CricInformer) August 3, 2023
అలాగే ‘ఇషాన్ కిషన్ కచ్చితంగా వరల్డ్‌కప్ టోర్నీలో రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉంటాఉ. కిషన్, సూర్య కుమార్ యాదవ్, సంజూ శామ్సన్, శ్రేయాస్ అయ్యర్ వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటారో లేదో నాకు కచ్చితంగా తెలియదు. వరల్డ్‌కప్ భారత్‌కి సెమీఫైనల్స్ తర్వాత ప్రారంభమవుతుంది. టీమిండియా రెండు పెద్ద మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది’ అని కైఫ్ పేర్కన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..