నవంబర్ 22 నుంచి టీమిండియా ఆస్ట్రేలియా టూర్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ ప్రారంభం కాకముందే టీమిండియా ఆటగాడికి సంబంధించిన ఓ పెద్ద వార్త వైరల్ అవుతుంది. ఈ ప్లేయర్ కొంతకాలంగా గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగా భారత సెలక్టర్లు ఈ ఆటగాడిని ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పుడు ఈ ఆటగాడికి విదేశాల్లో సర్జరీ జరిగింది. దీంతో ఈ ఆటగాడు త్వరలో మరోసారి మైదానంలోకి రానున్నట్లు తెలుస్తుంది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చాలా కాలంగా గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగా అతను న్యూజిలాండ్ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఆస్ట్రేలియా టూర్‌కు జట్టును ప్రకటించినప్పుడు, కుల్దీప్ యాదవ్ చాలా కాలంగా ఎడమ గజ్జ గాయంతో బాధపడుతున్నాడని BCCI తెలిపింది. దీంతో కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ అతన్ని ఎంపిక చేయలేదు. దీని తర్వాత, గాయం నుండి కోలుకోవడానికి కుల్దీప్ యాదవ్ శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. తాజాగా కుల్దీప్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ స్వయంగా తనే వెల్లడించాడు.
Few Days in München, to get better ! pic.twitter.com/f8zSUQmLRx
— Kuldeep yadav (@imkuldeep18) November 20, 2024
కుల్దీప్ యాదవ్ జర్మనీలో గాయానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను తన సోషల్ మీడియా ఖాతాలో దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫోటోలలో ఒకటి శస్త్రచికిత్స తర్వాత కూడా ఉంది. కులదీప్ యాదవ్ 2021లో కూడా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్‌కు మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. కుల్దీప్ తిరిగి మైదానంలోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే కుల్దిప్ మళ్లీ ఎప్పుడు రంగంలోకి దిగుతారనే సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: ఆ యంగ్ ప్లేయర్‌పై కన్నేసిన ఆర్సీబీ.. ఎందుకో తెలుసా?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి