Team India: టీమిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!

Ravichandran Ashwin: టీమ్ ఇండియా మాజీ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన బహిరంగ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్‌లో పెరుగుతున్న ఫ్యాన్ కల్చర్‌ను ఓ ‘వ్యాధి’గా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల కంటే వ్యక్తిగత అభిమానాన్ని పెంచడం ప్రమాదకరమని హెచ్చరించాడు.

Team India: టీమిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
Ravichandran Ashwin Comments On Indian Cricket Fan Culture
Image Credit source: X

Updated on: Mar 18, 2026 | 3:03 PM

Ravichandran Ashwin Comments on Indian Cricket Fan Culture: భారత క్రికెట్‌లో ఫ్యాన్ ఆర్మీల ప్రభావం పెరుగుతుందని రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియాలో ఆటగాళ్లపై వ్యక్తిగత అభిమానం పెంచుతూ టీమ్ ప్రయోజనాలను మర్చిపోవడం ప్రమాదకరమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి అభిప్రాయాలు కొన్నిసార్లు వ్యక్తిగతంగా వినిపించినా ఆ తర్వాత సోషల్ మీడియాలో వేరే పేర్లతో కనిపిస్తున్నాయని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఇది క్రికెట్‌కు వ్యాధి’ – అశ్విన్

అశ్విన్ మాట్లాడుతూ, “ఇది ఒక వ్యాధిలా మారింది. ఫ్యాన్ ఆర్మీలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చాలా ప్రమాదకరం. ఇది క్రికెట్‌కు మంచిది కాదు” అని వ్యాఖ్యానించాడు. అతను నేరుగా ఆటగాళ్లను తప్పుపట్టకపోయినా, ఈ విధమైన పీఆర్ కార్యకలాపాలు సోషల్ మీడియా యుద్ధాలకు దారితీస్తున్నాయని తెలిపాడు.

పీఆర్ కల్చర్‌పై షాకింగ్ కామెంట్స్..

ప్రస్తుతం ప్రతి ఆటగాడు ఒక బ్రాండ్‌గా మారిపోయాడని అశ్విన్ అన్నాడు. తమ విలువ పెంచుకోవడానికి పీఆర్ చర్యలు చేయడం సర్వసాధారణమని చెప్పినా, ఇతర ఆటగాళ్లపై విమర్శలు చేయడం తాను ఎప్పటికీ అంగీకరించనని స్పష్టం చేశాడు. ఇలాంటి చర్యలు టీమ్ స్పిరిట్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరించాడు.

గౌతమ్ గంభీర్‌కు మద్దతు..

అశ్విన్, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ప్రశంసించాడు. వ్యక్తిగత ఆటగాళ్ల కంటే టీమ్‌ను ముందుంచే వ్యక్తిగా గంభీర్‌ను కొనియాడాడు. “టీమ్ ముందుంటేనే విజయం సాధ్యం” అనే గంభీర్ సిద్ధాంతాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపాడు.

రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ ప్లాన్స్..

2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్, ప్రస్తుతం టీ20 లీగ్‌లలో ఆడాలని భావిస్తున్నాడు. అయితే గాయం కారణంగా కొన్ని టోర్నీలకు దూరమయ్యాడు. భవిష్యత్తులో ప్లేయర్-కోచ్‌గా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అశ్విన్ భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us