”సెంచరీల కోసం ఆడట్లేదు.. జట్టు గెలుపే ముఖ్యం”.. వారి నోరు మూయించిన టీమిండియా కెప్టెన్.!

|

Mar 27, 2021 | 4:01 PM

ఫార్మాట్ ఏదైనా కూడా.. పరుగుల వరద పారిస్తాడు.. సెంచరీల మోత మోగిస్తాడు. అయితే ఇప్పుడు అతడు మూడు అంకెల స్కోర్‌ను చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు...

సెంచరీల కోసం ఆడట్లేదు.. జట్టు గెలుపే ముఖ్యం.. వారి నోరు మూయించిన టీమిండియా కెప్టెన్.!
Kohli
Follow us on

Virat Kohli Comments: ఫార్మాట్ ఏదైనా కూడా.. పరుగుల వరద పారిస్తాడు.. సెంచరీల మోత మోగిస్తాడు. అయితే ఇప్పుడు అతడు మూడు అంకెల స్కోర్‌ను చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసి ఉండొచ్చు.! అతడెవరో కాదు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. శతకం కోసం గత రెండేళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సెంచరీల విషయంపై కోహ్లీని అడగగా.. ఎమోషనల్ అవుతూ సమాధానం ఇచ్చాడు.

”నేను ఎప్పుడూ సెంచరీల కోసం మ్యాచ్ ఆడలేదు. జట్టు గెలుపే ముఖ్యం. ఇప్పటిదాకా వ్యక్తిగత రికార్డులపై దృష్టి సారించలేదు. ఒకవేళ నేను సెంచరీ సాధించినా.. ఆ మ్యాచ్‌లో టీం ఓడిపోయినా ఆ శతకానికి విలువ ఉండదని” విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. గతంలో విరాట్ సెంచరీల కోసం ఆడతాడని పలువురు విమర్శలు గుప్పించగా.. వారి నోరు మూయిస్తూ కోహ్లీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

హైదరాబాద్‌లో హోళీ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలే.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!