IND vs SL 3rd T20: రాజ్‌కోట్‌లో సిరీస్ డిసైడర్ మ్యాచ్.. టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?

|

Jan 06, 2023 | 5:37 PM

India vs Sri Lanka: రాజ్‌కోట్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్‌కు నిర్ణయాత్మకంగా మారనుంది.

IND vs SL 3rd T20: రాజ్‌కోట్‌లో సిరీస్ డిసైడర్ మ్యాచ్.. టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Ind Vs Sl
Follow us on

India vs Sri Lanka 3rd T20I Rajkot: భారత్‌-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం రాజ్‌కోట్‌లో జరగనుంది. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న రికార్డును పరిశీలిస్తే భారత్‌కు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 4 టీ20 మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో టీమిండియా విజయం సాధించింది.

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 4 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది. 3 మ్యాచ్‌లు గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. 2013 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఇక్కడ తొలి టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత, నవంబర్ 2017లో న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

2019, 2022లో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో, దక్షిణాఫ్రికాను 82 పరుగులతో ఓడించింది. ఇప్పుడు రాజ్‌కోట్‌లో శ్రీలంకతో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానంలో శ్రీలంక జట్టు తొలిసారి మ్యాచ్ ఆడనుంది. మూడు టీ20ల సిరీస్‌కు ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కోట్‌లో భారత్ తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడి రోహిత్ శర్మ నిలిచాడు. ఇక్కడ ఆడిన 3 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 98 పరుగులు చేశాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2 మ్యాచ్‌ల్లో 94 పరుగులు చేశాడు. ఇక్కడ రోహిత్, కోహ్లి చెరో అర్ధ సెంచరీ చేశారు. యువరాజ్ సింగ్ 77 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఐదో స్థానంలో ఉన్నాడు. ధోనీ 73 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..