Team India Probable Squad For Champions Trophy 2025: ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్ధమైంది. పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. 8 జట్ల మధ్య జరగనున్న ఈ టోర్నీ 8 ఏళ్ల తర్వాత తిరిగి రాబోతోంది. ఈ టోర్నీకి టీమిండియా ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై కీలక అప్ డేట్ వచ్చింది. అదే సమయంలో టీమ్ ఇండియా జట్టులో ఏ 15 మంది ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందోనని క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మీడియా నివేదికల ప్రకారం, జనవరి 12 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును ప్రకటించవచ్చు. జనవరి 12లోగా అన్ని జట్లు తమ తాత్కాలిక బృందాన్ని ఐసీసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఐసీసీ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, ‘మొత్తం 8 జట్లు జనవరి 12 నాటికి తమ తాత్కాలిక జట్టును సమర్పించాలి. అయితే, వారు ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు చేయవచ్చు. సమర్పించిన జట్టును ఫిబ్రవరి 13న మాత్రమే ఐసీసీ విడుదల చేస్తుంది. టోర్నమెంట్ సమయంలో కూడా అవసరమైతే జట్టులో మార్పులు చేయవచ్చు. కానీ దానికి ICC అనుమతి అవసరం’ అంటూ చెప్పుకొచ్చారు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేస్తుంది. ఈ టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ ఆటగాళ్లకు అవకాశం దక్కడం ఖాయం. ఈ ఆటగాళ్లు ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించారు. అదే సమయంలో, రోహిత్‌తో ఓపెనింగ్ చేయడానికి శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను జట్టులో ఉంచవచ్చు. జైస్వాల్ ఇంకా భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. కానీ, అతని ఇటీవలి ఫామ్ చాలా బలంగా కనిపిస్తోంది.
రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా సెలక్టర్ల మొదటి ఎంపిక కానున్నారు. ఈ జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా కూడా సంజూ శాంసన్‌ని చూడొచ్చు. శ్రేయాస్ అయ్యర్, నితీష్ రెడ్డి నుంచి ఎవరైనా ఒక ఆటగాడిని ఎంచుకోవచ్చు. శ్రేయాస్ అయ్యర్‌కు వన్డే ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. వీరితో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను కూడా ఆల్ రౌండర్లుగా జట్టులోకి తీసుకోవచ్చు.
జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్‌కు కూడా అవకాశం దక్కడం దాదాపు ఖాయం. అదే సమయంలో, వన్డే ప్రపంచ కప్ 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మహ్మద్ షమీని కూడా జట్టులో చేర్చవచ్చు. వీరే కాకుండా జట్టులోని నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌కు కూడా చోటు దక్కవచ్చు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..