Asia Cup Prize Money: టైటిల్ గెలిచిన భారత్‌పై కాసుల వర్షం.. రోహిత్ సేనకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

India vs Sri Lanka: ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత జట్టు ఏకపక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకుంది. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించగా, 6 వికెట్లతో లంక నడ్డి విరిచిన మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Asia Cup Prize Money: టైటిల్ గెలిచిన భారత్‌పై కాసుల వర్షం.. రోహిత్ సేనకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Asia Cup 2023 Winners Team India

Updated on: Sep 17, 2023 | 10:04 PM

Asia Cup 2023 Prize Money Full Details: ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి భారత జట్టు 5 సంవత్సరాల తర్వాత ఈ టైటిల్‌ను దక్కించుకుంది. ఆసియా కప్ చరిత్రలో టీమిండియా ఎనిమిదోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. ఆఖరి మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ బాల్‌తో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే సాధించింది. ఆ తర్వాత విజేతగా టీమిండియా 150,000 US డాలర్లను(రూ. 1 కోటీ 25 లక్షలు) ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా శ్రీలంక జట్టుకు ప్రైజ్ మనీగా US $ 75,000 (రూ. 62 లక్షలు)దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్..

2023 ఆసియా కప్‌లో భారత జట్టు బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కనిపించింది. ఇందులో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, ఆ తర్వాత శ్రీలంకపై ముఖ్యమైన సమయాల్లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ లభించింది. ఈమేరకు 15,000 US డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైస్ మనీ అందుకున్నాడు.

కుల్దీప్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్..

ఫైనల్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డుగా సిరాజ్ US $ 5,000(రూ.4.16 లక్షలు) మొత్తాన్ని అందుకున్నాడు. దానిని అతను గ్రౌండ్స్‌మన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్..

శ్రీలంకపై విజయంతో ఆనందంలో ఆటగాళ్లు..

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us