Team India: భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!

|

Jan 14, 2025 | 1:05 PM

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయాలతో బీసీసీఐ మేల్కొంది. దీనిపై చర్చించేందుకు కొన్ని రోజుల క్రితం బీసీసీఐ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆటగాళ్ల రెమ్యునరేషన్ పై కూడా చర్చించినట్లు సమాచారం.

Team India: భారత క్రికెటర్లకు భారీ షాక్! వేతనాలపై బీసీసీఐ సంచలన నిర్ణయం!
Team India
Follow us on

సాధారణంగా టీం ఇండియా ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు నిర్ణీత మొత్తం చెల్లిస్తారు. అయితే ఇప్పుడు దీనిపై సమీక్షించేందుకు బీసీసీఐ ముందుకు వచ్చింది. అలాగే రానున్న రోజుల్లో ఆట తీరుకు అనుగుణంగా వేతనాలు అందజేయడంపై చర్చించారు. అంటే బాగా ఆడితే మంచి జీతం వస్తుంది. లేదంటే జీతం కట్‌ అవుతుంది. ఆటగాళ్లను బాధ్యతాయుతమైన స్థానంలో ఉంచేందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ చర్చించిందని సమాచారం. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చని భావిస్తోంది. సమీక్షా సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు ఆటగాడి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకుంటే అతని సంపాదనపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఆటగాళ్లపై మరింత బాధ్యత పెరుగుతుంది. వరుస వైఫల్యాల విషయంలో రెమ్యునరేషన్ తగ్గింపుతో పాటు జట్టు నుండి కూడా తొలగించవచ్చు. అంతే కాకుండా పూర్తి రెమ్యునరేషన్ చెల్లించి ఏడాది మొత్తం పేలవ ప్రదర్శన చేసినా ప్రయోజనం లేదన్న అభిప్రాయాన్ని బీసీసీఐ అధికారులు ముందుంచారు.

 

టీం ఇండియా ఆటగాళ్ల ప్రస్తుతం వేతనాలు..

  • టెస్ట్ రెమ్యునరేషన్: ఒక్కో మ్యాచ్‌కు రూ. 15 లక్షలు.
  • ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం కాని ఆటగాళ్లకు 7.5 లక్షలు.
  • ఒకరోజు రెమ్యునరేషన్: ఒక్కో మ్యాచ్‌కు రూ. 6 లక్షలు.
  • ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాని ఆటగాళ్లకు 3 లక్షలు.
  • టీ20 రెమ్యునరేషన్: ఒక్కో మ్యాచ్‌కు రూ. 3 లక్షలు.
  • ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం కాని ఆటగాళ్లకు 1.5 లక్షలు.

ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, ఒక సంవత్సరంలో 50% కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్న ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 30 లక్షల మొత్తం అందుతుంది. అంటే గతేడాది జరిగిన 16 టెస్టు మ్యాచ్‌ల్లో ఎనిమిది కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షలు లభిస్తాయి.కాగా వేతనాలు భారీగా అందుతున్నప్పటికీ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అందుకే టీమిండియా ఆటగాళ్ల ఉదాసీనతకు బ్రేకులు వేయాలనే చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి

BCCI ప్రదర్శన ఆధారిత పారితోషికం నిబంధనను అమలు చేస్తే, ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యే ఆటగాళ్ల రెమ్యునరేషన్‌లో హెచ్చుతగ్గులు తప్పవు. అయితే వీటి అమలుపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..