India A Squad: దక్షిణాఫ్రికాతో రెడ్ బాల్ సిరీస్‌ ఆడనున్న ఆ ఇద్దరు.. బీసీసీఐ కీలక నిర్ణయం.. 23న ప్రయాణం

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో T20I కోసం ఇద్దరు ఆటగాళ్లు కోల్‌కతాలోనే ఉన్నారు. అయితే నవంబర్ 23న భారత ఏ జట్టుతో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారు.

India A Squad: దక్షిణాఫ్రికాతో రెడ్ బాల్ సిరీస్‌ ఆడనున్న ఆ ఇద్దరు.. బీసీసీఐ కీలక నిర్ణయం.. 23న ప్రయాణం
Deepak Charar Ishan Kishan

Edited By:

Updated on: Nov 22, 2021 | 12:20 PM

India Blues: భారత యువ జట్టు అంటే టీమిండియా ఏ మూడు టెస్టుల కోసం నవబంర్ 23న దక్షిణాఫ్రికా బయలుదేరనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో T20I కోసం ఇద్దరు ఆటగాళ్లు దీపక్ చహార్, ఇషాన్ కిషన్ కోల్‌కతాలోనే ఉన్నారు. టీ20 సిరీస్ ముగిపిపోవడంతో ప్రస్తుతం భారత ఏ టీంతో కలిసి వీరంతా దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారు.

“దీపక్, ఇషాన్‌లను జట్టులోకి తీసుకున్నారు. వారు కోల్‌కతాలో మ్యాచ్‌ను ముగించి, దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు ఏ జట్టుతో జతకట్టనున్నారు” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ రైల్వేస్‌కు చెందిన ఉపేంద్ర యాదవ్‌ను ‘ఏ’ టూర్‌కు మొదట ఒక వికెట్ కీపర్‌ను మాత్రమే ఎంచుకున్నారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్‌ను కూడా పంపుతున్నారు.

“వారికి రెండవ కీపర్ అవసరం. ఇషాన్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. దీంతో వికెట్ కీపర్‌గా ఇషాన్‌ను దక్షిణాఫ్రికా పంపనున్నాం” అని మరొక అధికారి తెలిపారు.

చాహర్ ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. కానీ బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. అందుకే సెలెక్టర్లు అతన్ని బిజీగా ఉంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. టీ20 సిరీస్‌ అనంతరం వీరిని దక్షిణాఫ్రికా పంపాలని నిర్ణయించారు.

నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్ ఏ జట్టుకు గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రియాంక్ పాంచల్ నాయకత్వం వహించనున్నాడు.

భారత ఏ జట్టు: ప్రియాంక్ పాంచల్ (కెప్టెన్), పృథ్వీ షా, హనుమ విహారి, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బి అపరాజిత్, ఉపేంద్ర యాదవ్ (కీపర్), కె గౌతం, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జాన్ నాగ్వాస్వాల్లా, ఇషాన్ కిషన్ (కీపర్), దీపక్ చాహర్

Also Read: IPL 2022: స్టార్, సోనీలకు చెక్ పెట్టనున్న జియో.. ఐపీఎల్ ప్రసారాల కోసం బరిలోకి..!

I‍ND vs NZ: పాదాలను నేలపైనే ఉంచండి.. విజయ గర్వం తలకెక్కితే ఇక అంతే: ఆటగాళ్లకు రాహుల్ ద్రవిడ్ హెచ్చరిక

Unmukt Chand Marriage: పెళ్లిపీటలెక్కిన ఉన్ముక్త్ చంద్.. ఈ క్రికెటర్‌ని ‘క్లీన్‌బౌల్డ్‌’ చేసిన ఆమె ఎవరంటే?