ICC Rankings: పాక్ కెప్టెన్ ప్లేస్‌పై కన్నేసిన టీమిండియా మిస్టర్ 360.. నంబర్ వన్‌కు కొద్ది దూరంలోనే..

|

Aug 03, 2022 | 3:20 PM

తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అతను బాబర్ అజామ్ కంటే కేవలం 2 రేటింగ్ పాయింట్లు వెనుకంజలో నిలిచాడు.

ICC Rankings: పాక్ కెప్టెన్ ప్లేస్‌పై కన్నేసిన టీమిండియా మిస్టర్ 360.. నంబర్ వన్‌కు కొద్ది దూరంలోనే..
Icc Rankings Surya Kumar Yadav
Follow us on

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ త్వరలో ఈ ఫార్మాట్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా మారే ఛాన్స్ ఉంది. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌ను ప్రకటించగా, ఇందులో సూర్యకుమార్ రెండో స్థానానికి చేరుకున్నాడు. సూర్యకుమార్ రెండు స్థానాలు ఎగబాకి 2వ స్థానంలో నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ బాబర్ ఆజం నుంచి అతను కేవలం 2 రేటింగ్ పాయింట్ల దూరంలో ఉండటం విశేషం. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే, అతను నంబర్ వన్ ర్యాంక్ సాధించడం సాధ్యమేనని భావిస్తున్నారు.

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఇవి కూడా చదవండి

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం బాబర్‌ ఆజం 818 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 816 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ రిజ్వాన్ 794 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఐడెన్ మార్క్రామ్ నాలుగో స్థానంలో, డేవిడ్ మలన్ ఐదో స్థానంలో ఉన్నారు.

సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్‌తో మారిన లెక్కలు..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ టీమిండియా 360 ప్లేయర్ 44 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. సూర్యకుమార్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో టీ20 ర్యాంకింగ్స్‌ ఎగబాకాడు. వెస్టిండీస్ సిరీస్‌లో సూర్యకుమార్ ఓపెనర్ పాత్రలో బరిలోకిదిగి, 4 సిక్సర్లు, 8 ఫోర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్‌తో భారత్ ఇంకా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే, అతడు నంబర్ వన్ స్థానానికి వస్తాడు. ఎందుకంటే బాబర్ ఆజం ఆసియా కప్‌లో నేరుగా టీ20 క్రికెట్ ఆడాల్సి ఉంది. ఇది UAEలో ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పాక్ జట్టు నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీని తర్వాత ఆగస్టు 28న ఆసియా కప్‌లో పాక్ జట్టు తలపడనుంది. అంటే, బాబర్ ఆజం ఆసియా కప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే, అతనికి నంబర్ వన్ కుర్చీ లేకపోవచ్చు. అదే సమయంలో సూర్యకుమార్ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..