Team India: 3 హ్యాట్రిక్‌లతో రికార్డ్.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్..

Amit Mishra Retires From All Formats of Cricket: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా ఉన్న మిశ్రా, చివరిసారిగా 2024లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. 162 మ్యాచ్‌ల్లో 174 వికెట్లతో ఏడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. లీగ్ చరిత్రలో మూడు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్ మిశ్రా.

Team India: 3 హ్యాట్రిక్‌లతో రికార్డ్.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్..
Amit Mishra Retires

Updated on: Sep 04, 2025 | 3:41 PM

Amit Mishra Retires From All Formats of Cricket: లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గురువారం అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతను 2017లో ఇంగ్లాండ్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 42 ఏళ్ల మిశ్రా 2003లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే ముక్కోణపు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

మిశ్రా భారత జట్టు తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మూడు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

25 సంవత్సరాలు ఎంతో చిరస్మరణీయమైనవి..

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లో తన రిటైర్మెంట్ ప్రకటనను పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో “క్రికెట్‌లో నా ఈ 25 సంవత్సరాలు చిరస్మరణీయమైనవి. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహాయక సిబ్బంది, నా సహచరులు, నా కుటుంబ సభ్యులకు నేను చాలా కృతజ్ఞుడను” అంటూ చెప్పుకొచ్చాడు.

“నేను ఎప్పుడు, ఎక్కడ ఆడినా ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చిన అభిమానుల ప్రేమ, మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రికెట్ నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను, అమూల్యమైన పాఠాలను ఇచ్చింది. మైదానంలో గడిపిన ప్రతి క్షణం నా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది” అని ఆయన అన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా ఉన్న మిశ్రా, చివరిసారిగా 2024లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. 162 మ్యాచ్‌ల్లో 174 వికెట్లతో ఏడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. లీగ్ చరిత్రలో మూడు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్ మిశ్రా.

ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆడుతూ అతను మూడు హ్యాట్రిక్‌లు సాధించాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..