Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫిట్‌నెస్‌లో పాసైన కేఎల్ రాహుల్.. శ్రేయస్‌పై డౌట్?

KL Rahul: రాహుల్ మినహా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికీ పూర్తి ఫిట్ గా లేకపోవడంతో ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా కనిపిస్తోంది. శ్రేయాస్ వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు. మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మధ్యలోనే జట్టును విడిచిపెట్టాడు. మరో రెండు రోజుల్లో శ్రేయస్‌పై నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రేయాస్ కూడా బ్యాటింగ్ ప్రారంభించాడు.

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫిట్‌నెస్‌లో పాసైన కేఎల్ రాహుల్.. శ్రేయస్‌పై డౌట్?
Kl Rahul

Updated on: Aug 19, 2023 | 8:39 AM

Team India: ఐపీఎల్ (IPL 2023)లో గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ (KL Rahul) ఇప్పుడు తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆసియా కప్, ప్రపంచకప్ (ODI World Cup 2023)లో ఆడతారా అనే ప్రశ్న టీమిండియా అభిమానులను వేధిస్తోంది. అయితే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని PTI నివేదించింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందుతున్న రాహుల్ వికెట్ కీపింగ్‌తో పాటు చాలా సేపు బ్యాటింగ్ చేయడంతోపాటు రాహుల్ ప్రదర్శన ఎన్‌సీఏను సంతృప్తిపరిచినట్లు సమాచారం.

అలాగే కేఎల్ రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, ఇప్పుడు ఆసియా కప్ జట్టులో అతని ఎంపిక ఖాయమని పీటీఐ తన నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం, రాహుల్ ఈ వారం మ్యాచ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. నిరంతరం బ్యాటింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అతని బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ శుక్రవారం నుంచి రాహుల్ వికెట్ కీపింగ్‌ను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఎంపిక దాదాపు ఖరారైంది..

మే ప్రారంభంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాహుల్ తొడకు గాయమైంది. ఆ తర్వాత, రాహుల్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి NCAలో పునరావాసంలో ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితమే రాహుల్ ఆసియా కప్‌కు ఫిట్‌గా ఉండడని వార్తలు వచ్చాయి. కానీ, త్వరగానే కోలుకున్న రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ అద్భుత ఫిట్ నెస్ కనబరిచినట్లు సమాచారం.

కేఎల్ రాహాల్, విరాట్ కోహ్లీల రికార్డులు..

ఆసియాకప్‌నకు టీమిండియా ఎంపిక ఆగస్టు 21వ తేదీ సోమవారం జరగనుండగా, అంతకుముందే వన్డే ఫార్మాట్‌లో బ్యాటింగ్‌లో మిడిలార్డర్ కష్టాలను ఎదుర్కొంటున్న టీమిండియాకు ఈ వార్త ధైర్యాన్నిచ్చింది. రాహుల్ రాకతో ఆ సమస్య తీరిపోతుంది. వికెట్ కీపింగ్‌తో పాటు మరో బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు బలం చేకూర్చనున్నాడు.

అయ్యర్ వేచి ఉండాల్సిందే?


కానీ, రాహుల్ మినహా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికీ పూర్తి ఫిట్ గా లేకపోవడంతో ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా కనిపిస్తోంది. శ్రేయాస్ వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు. మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మధ్యలోనే జట్టును విడిచిపెట్టాడు. మరో రెండు రోజుల్లో శ్రేయస్‌పై నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రేయాస్ కూడా బ్యాటింగ్ ప్రారంభించాడు. ఒకవేళ శ్రేయాస్ ఆసియా కప్‌నకు ఫిట్‌గా లేకుంటే.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ నుంచి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్ ప్రాక్టీస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..