ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భారత యంగ్ ప్లేయర్.. ప్రకటించిన ఐసీసీ

శ్రేయాస్ అయ్యర్ గత నెలలో వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20Iలలో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో టీమిండియా ఆయా సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయడంలో సహాయపడ్డాడు.

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భారత యంగ్ ప్లేయర్.. ప్రకటించిన ఐసీసీ
Ind Vs Sl Icc Player Of The Month Awards Shreyas Iyer

Updated on: Mar 14, 2022 | 4:57 PM

గత కొన్ని వారాలుగా భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2022 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తాన్ని వెచ్చించి శ్రేయాస్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ 2022 వేలంలో కెప్టెన్‌గా నియమించింది. అయితే, శ్రేయాస్ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటునట్లు కనిపిస్తోంది. దీనితో పాటు, అతని బ్యాట్ గత నెలలో వన్డేలు, టీ20, టెస్టు మ్యాచ్‌లలో కూడా అద్భుతంగా రాణించడంతో అతనికి భారీ బహుమతి లభించింది. శ్రేయాస్ అయ్యర్ ఫిబ్రవరి నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు(ICC Player Of The Month Award)కు ఎంపికయ్యాడు.