ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో? పూర్తి వివరాలు మీ కోసం!

మరికొన్ని రోజుల్లోనే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి టీమిండియా మ్యాచ్ లు ఎప్పుడున్నాయి? ఏ వేదికల్లో జరుగనున్నాయి? లాంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో? పూర్తి వివరాలు మీ కోసం!
Champions Trophy

Updated on: Feb 13, 2025 | 3:41 PM

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తోంది. అంటే పాకిస్థాన్‌తో పాటు కొన్ని మ్యాచ్‌లో దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మరి టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఏంటి? ఏ రోజు ఈ టీమ్‌తో ఏ వేదికలో ఉండనుందో ఇప్పుడు పిన్‌ టూ పిన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న, న్యూజిల్యాండ్‌తో మార్చ్‌ 2న ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుంది. మార్చ్‌ 4వ తేదీన మొదటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. గ్రూప్‌-బీలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు ఉన్నాయి. భారత జట్టు సెమీస్‌కు చేరితో వీటిలో ఏదో ఒక టీమ్‌తో సెమీస్‌లో తలపడనుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ మర్చ్‌ 9న జరగనుంది. టీమిండియా సెమీ ఫైనల్‌, ఫైనల్‌కు వరకు వెళ్తే.. ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి.

టీమిండియా సెమీస్‌కు క్వాలిఫై కాకపోతే.. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. టీమిండియా గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఆడనుంది. మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ మొత్తం ఛాంపియన్స్‌ ట్రోఫీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌ మొత్తం టోర్నీకే హైలెట్‌గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఐసీసీ కూడా ఈ మ్యాచ్‌కు భారీ వ్యూయర్‌షిప్‌ వస్తుందని ఆశలు పెట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..