Video: వామ్మో ఇదేం ట్యాలెంట్ సామీ.. కళ్లకు గంతలతో బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇరగదీసిన కోహ్లీ.. షాక్‌లో నెటిజన్లు..

Virat Kohli Team India: విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లీని చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Video: వామ్మో ఇదేం ట్యాలెంట్ సామీ.. కళ్లకు గంతలతో బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇరగదీసిన కోహ్లీ.. షాక్‌లో నెటిజన్లు..
Virat Kohli Viral Video

Updated on: Feb 05, 2023 | 10:08 AM

Virat Kohli Trending Video: ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా వంటి బ్యాట్స్‌మెన్‌లపై అభిమానుల చూపులు నెలకొన్నాయి. అయితే విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలో విరాట్ కోహ్లీ కళ్లకు గంతలు కట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతే కాకుండా కళ్లకు గంతలు కట్టినా సరైన లక్ష్యాన్ని చేధించి షాక్ ఇచ్చాడు మాజీ కెప్టెన్.

సోషల్ మీడియాలో వైరల్..

విరాట్ కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాకుండా, అభిమానులు కామెంట్లు చేస్తూ, విపరీతంగా వైరల్ చేస్తు్న్నారు. ఇదే సమయంలో నెటిజన్లు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం మధ్య పోలికలు చేస్తున్నారు. బాబర్ ఆజం ఎప్పటికీ ఇలా చేయలేడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాగ్‌పూర్‌ టెస్టుకు ఇరు జట్లు సిద్ధం..

ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగ్‌పూర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ధర్మశాలలో జరగనుంది. అదే సమయంలో మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమ్ ఇండియా వద్ద ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..