IND vs AUS: నెట్ ప్రాక్టీస్‌లో అదరగొట్టిన కోహ్లీ.. ఇకపై ఆరో బౌలర్‌‌కు ఢోకా లేదంటోన్న నెటిజన్లు.. వైరల్ ఫొటోస్..

| Edited By: Anil kumar poka

Sep 24, 2022 | 11:41 AM

మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించి, షాక్ ఇచ్చాడు.

IND vs AUS: నెట్ ప్రాక్టీస్‌లో అదరగొట్టిన కోహ్లీ.. ఇకపై ఆరో బౌలర్‌‌కు ఢోకా లేదంటోన్న నెటిజన్లు.. వైరల్ ఫొటోస్..
Virat Kohli Bowling
Follow us on

ఆసియా కప్‌లో సత్తా చాటిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మొహాలీలో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ ప్రాక్టీస్‌లోనూ చెమటోడ్చాడు. ఈ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేస్తున్న ఫొటోలు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ షేర్ చేసింది. కోహ్లీకి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మొహాలీలో విరాట్ టీమ్ ఇండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. స్పిన్‌ బౌలింగ్‌ చేస్తూ కోహ్లీ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఇటీవల జరిగిన ఆసియాకప్‌లోనూ విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ చేశాడు. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌ వేశాడు. ఈ ఓవర్‌లో కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

విరాట్ కోహ్లీకి ఆసియా కప్ చాలా ప్రత్యేకమైనది. నెల రోజుల విరామం తర్వాత విరాట్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఈ టోర్నీలో కోహ్లి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా వచ్చాయి.