MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ట్రెండ్ సెట్టర్ గానే ఉంటాడు. అతను ఏం చేసినా.. ప్రత్యేకమే. అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఐపీఎల్ ద్వారా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం ఏదోరకంగా ట్రీట్ ఇస్తూనే ఉంటాడు. తాజాగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతున్నాడు. నయా లుక్‌లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ‘అస్లీ పిక్చర్ అభీ బాకీ హై’ అభిమానులకు పండుగలాంటి పిక్సర్‌ను వదిలాడు. ఈ పిక్చర్‌ను చూసి ధోనీ అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ధోనీకి సంబంధించిన ఎక్సలెంట్ పిక్‌ని ట్విట్ చేసింది. ఈ ఫోటోలో ధోనీ.. గోల్డెన్ హెయిర్‌తో తళుక్కు మన్నాడు. ఆ స్మైల్.. ఆ హెయిర్ స్టైల్.. నయా లుక్‌లో మిస్టర్ కూల్ కాస్తా.. మిస్టర్ స్టైలీష్ అయ్యాడు. సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఈ పిక్చర్‌ను రిలీజ్ చేసింది. ‘‘వివో ఐపిఎల్ కి ధోనీ లోని న్యూ షేడ్‌ని చూడొచ్చు. అస్లీ పిక్చర్ అభీ బాకీ హై’’ అంటూ క్యా్ప్షన్ పెట్టారు. స్టార్ట్ స్పోర్ట్స్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ధోనీ అభిమానులు అయితే, అమితమైన ప్రేమను చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏక్ ధమ్ ఉన్నవ్ మహీ భాయ్’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఇటీవలే ధోనీ హెయిర్ స్టైల్‌కి సంబంధించి ఓ ఫోటో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ హెయిర్ స్టైల్‌ని బాలీవుడ్, క్రికెటర్ల ఫేవరెట్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ మేకోవర్ చేశాడు.
కాగా, ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కాగా.. కరోనా వైరస్ వ్యాప్తితో వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేస్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మొదలవ్వనున్నాయి. యూఏఈ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగుతాయి. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
#MSDhoni‘s up to something new before #VIVOIPL! ?
Stay tuned for the Asli Picture!#AsliPictureAbhiBaakiHai pic.twitter.com/4w51ynIrs0
— Star Sports (@StarSportsIndia) August 19, 2021
Also read:
Crime News: చెల్లెలితో యువకుడి ప్రేమాయణం.. అది తెలిసిన ఆ ఇద్దరు సోదరులు ఏం చేశారంటే..
Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..
KRMB: కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ఒత్తిడి తీవ్రతరం.. 27న కేఆర్ఎంబీ భేటీ నేపథ్యంలో మరో లేఖ