Ind Vs Eng: రెండో టీ20 విజయం.. అంతలోనే టీమిండియాకు ఊహించని షాక్.. కారణమిదే.!

India Vs England: ఇంగ్లాండ్‌పై రెండో టీ20 విజయం సాధించిన ఆనందంలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.....

Ind Vs Eng: రెండో టీ20 విజయం.. అంతలోనే టీమిండియాకు ఊహించని షాక్.. కారణమిదే.!

Updated on: Mar 15, 2021 | 9:19 PM

India Vs England: ఇంగ్లాండ్‌పై రెండో టీ20 విజయం సాధించిన ఆనందంలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారీ జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు టీమిండియా ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాధ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ పున: ప్రారంభం తర్వాత టీమిండియాకు జరిమానా పడటం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండుసార్లు భారత్‌కు జరిమానా పడిన సంగతి తెలిసిందే. కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం విదితమే. కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెబ్యూ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ వీరోచిత అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. దీనితో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం అయింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!