Team India : టీమిండియాకు గౌతమ్ గంభీర్ గ్రాండ్ ట్రీట్.. ఢిల్లీలో విందు భోజనం.. ఆటగాళ్లకు స్పెషల్ పార్టీ ఎందుకంటే ?

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది. అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత, రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన, భారత జట్టు చీఫ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్, టీమ్‌లోని ఆటగాళ్లందరికీ తన ఇంట్లో స్పెషల్ డిన్నర్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Team India : టీమిండియాకు గౌతమ్ గంభీర్ గ్రాండ్ ట్రీట్.. ఢిల్లీలో విందు భోజనం.. ఆటగాళ్లకు స్పెషల్ పార్టీ ఎందుకంటే ?
Team India Dinner

Updated on: Oct 07, 2025 | 7:17 PM

Team India : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది. అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత, రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన, భారత జట్టు చీఫ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్, టీమ్‌లోని ఆటగాళ్లందరికీ తన ఇంట్లో స్పెషల్ డిన్నర్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 10న రెండో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఈ విందు భోజనం ఏర్పాటు చేయనున్నారు.

ఇది ఎలాంటి అధికారిక కార్యక్రమం కాకుండా ఆటగాళ్ల మధ్య సరదాగా గడపడానికి ఏర్పాటు చేసిన అనధికారిక పార్టీ. గంభీర్ ఢిల్లీలోని తన లగ్జరీ ఇంట్లో, గార్డెన్ ఏరియాలో ఈ విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ విందు మొత్తం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఢిల్లీలో వర్షం పడితే, ఈ పార్టీని రద్దు అయ్యే అవకాశం ఉంది. గంభీర్ తన స్వస్థలమైన ఢిల్లీలో టీమిండియాకు ట్రీట్ ఇవ్వడం ఆటగాళ్ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతంగా ఆడి, ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 162 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా వెస్టిండీస్ కేవలం 146 పరుగులకే పరిమితమై, ఘోరంగా ఓటమి పాలైంది.

వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ భారత్ వైట్-బాల్ సిరీస్‌లలో ఆడనుంది. ముందుగా అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత, అక్టోబర్ 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు సిరీస్‌లకు భారత జట్లను కూడా ప్రకటించారు. ముఖ్యంగా, అక్టోబర్ 31న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ లో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు సంబంధించిన అన్ని టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయాయని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us