టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఖపర్ఖేడా, మిలన్ చౌక్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. తిలక్ యాదవ్ తన ఇంట్లో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న క్రికెటర్లు ఉమేశ్ ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఉమేష్ ప్రస్తుతం తన కుటుంబంతో ఉన్నాడు ఎందుకంటే ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత, టీమ్ ఇండియాకు 5 రోజుల విరామం లభించింది. కాగా తిలక్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. చాలా ఏళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం నాగ్‌పూర్‌కు వచ్చాడు. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో ఉద్యోగం సంపాదించి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు ఉమేశ్ కాకుండా మరో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక ఉమేష్ తల్లి కూడా చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఇదిలా ఉంటే ఉమేష్ తండ్రి తిలక్‌కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన తన తనయుడు ఉమేష్‌ను మాత్రం పోలీసు లేదా మిలిట్రీలో చేర్చాలనుకున్నారు.
అయితే ఉమేష్ యాదవ్‌కు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. కుమారుడి ఇష్టాన్ని కాదనలేని తిలక్ అందుకు తన పూర్తి మద్దతునిచ్చాడు. ఈక్రమంలోనే తన ఫెర్మామెన్స్‌తో మొదట రంజీల్లో చోటు దక్కించుకున్నాడు. ఆతర్వాత భారత జట్టులో ఆడే చాన్స్ దక్కించుకున్నాడు. 2010లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఉమేశ్.. స్టార్ పేసర్‌గా ఎదిగాడు. ఇక తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు తండ్రి కన్నుమూయడంతో మూడో టెస్టుకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తుంది.
क्रिकेटर उमेश यादव के पिता का हुआ निधन !
एक पुत्र के लिए इससे बड़ा कोई दुःख नहीं हो सकता है ।#umeshyadav #father#cricketer #TeamIndia pic.twitter.com/ordDnsBVFk— Satyendra Sharma (@Satyendrashrmaa) February 23, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..