KS Bharat: విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్న క్రికెటర్‌ కేఎస్ భరత్.. సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు

|

Mar 17, 2023 | 3:47 PM

టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ సతీసమేతంగా విశాఖ పీఠాన్ని సందర్శించారు. సతీమణి అంజలితో కలిసి శారదా పీఠానికి వెళ్లిన అతను రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

KS Bharat: విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్న క్రికెటర్‌ కేఎస్ భరత్.. సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
Ks Bharat
Follow us on

టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ సతీసమేతంగా విశాఖ పీఠాన్ని సందర్శించారు. సతీమణి అంజలితో కలిసి శారదా పీఠానికి వెళ్లిన అతను రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భరత్‌- అంజలి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచి ఈ ధనాధన్‌ మెగా లీగ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లేముందుగా శార‌దా పీఠాన్ని సంద‌ర్శించారు భరత్ . అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసమే శారదా పీఠానికి విచ్చేసినట్లు టీమిండియా క్రికెటర్‌ తెలిపారు. కాగా భరత్ ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరుపున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో టైటాన్స్‌ ఫ్రాంచైజీ రూ. 1.2 కోట్లు వెచ్చించి మరీ తెలుగు క్రికెటర్‌ను సొంతం చేసుకుంది.

విశాఖపట్నానికి చెందిన భరత్‌ బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీతో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. వికెట్‌ కీపింగ్‌లో ఆకట్టుకున్నా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. 4 మ్యాచుల్లో 20 సగటుతో కేవలం 101 పరుగులు మాత్రమ చేశాడు. అయితే టెస్టులతో పాటు వన్డే, టీ20 జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు భరత్‌. అందులో భాగంగా రాబోయే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే తలంపుతో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..