World Cup 2023: రోహిత్ శర్మకు టెన్షన్ పెడుతోన్న ఆ ఇద్దరు ప్లేయర్స్.. అసలు కారణం ఏంటంటే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి దిగ్గజాలు లేని సమయంలోనే టీమ్ ఇండియా ఈ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ టీమిండియాకు ఫెవర్‌గా ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయింగ్ 11 పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో రోహిత్ ఈ మ్యాచ్‌లోకి దిగితే.. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీని...

వరల్డ్ కప్ 2023లో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన వరల్డ్ కప్ జర్నీని ప్రారంభించనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ రెట్టించిన ఉత్సాహంతో పాల్గొననుంది. దీనికి కారణం ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి దిగ్గజాలు లేని సమయంలోనే టీమ్ ఇండియా ఈ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ టీమిండియాకు ఫెవర్‌గా ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయింగ్ 11 పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో రోహిత్ ఈ మ్యాచ్‌లోకి దిగితే.. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీని తప్పించాల్సి ఉంటుంది. స్పిన్నర్లలో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మంచి ప్రదర్శన కల్పించగలరు.
ఇక మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు పేసర్లుగా జట్టుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం నాడు తీవ్రంగా ప్రాక్టీస్ చేసినందున అశ్విన్ ఆడటం ఖాయమని భావిస్తున్నారు. నెట్స్‌లోనూ బ్యాటింగ్ చేశాడు. ఇది కాకుండా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మకు కుల్దీప్ టెన్షన్ పెడుతున్నాడు. కుల్‌దీప్ గ్రౌండ్‌లోకి వస్తే రోహిత్ అంచనాలు అందుకోవాల్సి ఉంటుంది. షమీ లాంటి ఫాస్ట్ బౌలర్ స్థానంలో కుల్దీప్ జట్టులో చోటు దక్కించుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ ఆటతీరు బాగా లేకుంటే రోహిత్ జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతాయి. షమీ లాంటి బౌలర్‌ను జట్టుకు దూరంగా ఎందుకు ఉంచారనే ప్రశ్న ఎదురవుతుంది.
అదే సమయంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోకపోయినా రోహిత్‌పై ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకంటే ఇటీవలి మ్యాచ్‌ల్లో కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆసియా కప్‌లో కుల్దీప్ 9 వికెట్లు తీశాడు. అతను మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. బౌలర్ల గురించే కాకుండా బ్యాట్స్‌మెన్‌పై కూడా ఎన్నో రకాల ప్రశ్నలు రోహిత్ మదిలో మెదులుతుంటాయి. శ్రేయాస్ అయ్యర్ లేదా సూర్యుక్మర్ యాదవ్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్న వస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. గాయం తర్వాత తిరిగి వస్తున్నాడు. అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ అతడిని సిట్ అవుట్ చేస్తాడో లేదో చెప్పడం కష్టం. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న సూర్యకుమార్ యాదవ్ గురించి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సూర్యకుమార్ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని ఈ ఇన్నింగ్స్‌లు టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు.
ప్లేయింగ్ 11 టీమ్ అంచనా: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్/ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి…




