Ind vs Ban: బంగ్లా అంటే అంత భయమెందుకు రోహిత్ భయ్యా.. రికార్డులు చూస్తే తల దించుకోవాల్సిందే..

Rohit Sharma Against Bangladesh in Test Cricket: బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ తన సన్నాహాలను ప్రారంభించింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అందులో మొదటి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు, రెండవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది.

Ind vs Ban: బంగ్లా అంటే అంత భయమెందుకు రోహిత్ భయ్యా.. రికార్డులు చూస్తే తల దించుకోవాల్సిందే..
Rohit Sharma

Updated on: Aug 21, 2024 | 7:55 PM

India vs Bangladesh: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ మజా మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను తెలుసుకోవాలనుకుంటున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో రోహిత్ రికార్డు చాలా నిరాశపరిచింది.

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అందులో మొదటి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు, రెండవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది.

2024లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉందంటే?

రోహిత్ శర్మ 2024లో టెస్టుల్లో మొత్తం 11 ఇన్నింగ్స్‌లు ఆడి 455 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ల్లో అతను 45.50 సగటుతో పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా కెరీర్..

బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొత్తం 3 టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 11 సగటుతో 33 పరుగులు మాత్రమే చేశాడు.

ఈసారి సత్తా చాటగలడా..

రోహిత్ శర్మ భారత్‌లో ఇప్పటివరకు 29 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 45 ఇన్నింగ్స్‌ల సహాయంతో 2402 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో రోహిత్ సగటు 61.59గా ఉంది. అందువల్ల, రాబోయే ఈ టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మార్పు చూపిస్తాడని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..