IND vs BAN: అలాంటోళ్లనే ఎంపిక చేస్తాం.. తొలి టెస్ట్‌లో బరిలోకి దిగే ప్లేయింగ్ 11పై రోహిత్ షాకింగ్ కామెంట్స్

|

Sep 17, 2024 | 8:26 PM

Rohit Sharma On Indian Team Playing 11: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే ఎలెవన్‌కి సంబంధించి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సూచన చేశాడు. ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేస్తారని రోహిత్ శర్మను అడిగినప్పుడు, జట్టు ఏ శైలిలో ఆడాలనుకుంటోంది, విజయావకాశాలు ఎలా ఉంటాయి అనే దాని ఆధారంగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తారని తెలిపాడు.

IND vs BAN: అలాంటోళ్లనే ఎంపిక చేస్తాం.. తొలి టెస్ట్‌లో బరిలోకి దిగే ప్లేయింగ్ 11పై రోహిత్ షాకింగ్ కామెంట్స్
Ind Vs Ban Playing 11
Follow us on

Rohit Sharma On Indian Team Playing 11: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే ఎలెవన్‌కి సంబంధించి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సూచన చేశాడు. ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేస్తారని రోహిత్ శర్మను అడిగినప్పుడు, జట్టు ఏ శైలిలో ఆడాలనుకుంటోంది, విజయావకాశాలు ఎలా ఉంటాయి అనే దాని ఆధారంగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తారని తెలిపాడు.

వాస్తవానికి సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఇందుకోసం టీమ్ ఇండియా తన సన్నాహాల్లో బిజీగా ఉంది. చెపాక్‌లో ఆటగాళ్లంతా చెమటలు కక్కుతున్నారు. అయితే, తొలి టెస్టు మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.

ప్లేయింగ్ 11ని ఎంపిక చేసేప్పుడు చాలా విషయాలు పరిశీలిస్తాం – రోహిత్ శర్మ..

చెన్నై టెస్టు మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. చాలా విషయాలు చాలా సూటిగా ఉన్నాయి. మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ప్లేయింగ్ ఎలెవెన్‌ని ఎంచుకున్నప్పుడు, ఆటగాళ్లు ఇంతకు ముందు ఏం చేశారో చూస్తాం. ఆ ప్లేయర్ పరుగులు, వికెట్లు, అతనికి ఎలాంటి అనుభవం ఉంది. ఇది కాకుండా, వారు ఎలాంటి ప్రభావం చూపగలరు? అని చూస్తుంటాం. మేం చివరిసారిగా భారత్‌లో సిరీస్ ఆడినప్పుడు చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. చాలా మంది ఆటగాళ్లు ఆ సిరీస్‌లో భాగం కాలేదు. ఈసారి కూడా కొంతమంది ఆటగాళ్లు గాయపడి NCAలో ఉన్నారు. అయితే, వారిలో ఎక్కువ మంది జట్టుతో ఉన్నారు. మేం ఎలా ఆడాలో, టెస్ట్ మ్యాచ్‌లో గెలవడానికి మాకు ఉన్న ఉత్తమ అవకాశం ఏమిటో చూస్తాం. తదనుగుణంగా మేం మా ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంచుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించే అవకాశం తక్కువగా ఉంది. దీంతో పాటు ఆకాశ్‌దీప్‌, యశ్‌ దయాల్‌ కూడా ఎంపికయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..