నేటి నుంచి అంటే జులై 12 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే సిరీస్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం రోహిత్ శర్మ కనీసం 5 సిక్సర్లు కొట్టాల్సి ఉంటుంది.
రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 245 సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ మరో 5 సిక్సర్లు బాదితే ఈ ఫార్మాట్‌లో 250 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.
భారత్ తరపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పటికే గుర్తింపు పొందాడు. రోహిత్ శర్మ 229 మ్యాచ్‌ల్లో 245 సిక్సర్లు కొట్టాడు. 350 వన్డేల్లో 229 సిక్సర్లు బాదిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు.
అగ్రస్థానంలో అఫ్రిది..
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది రికార్డు సృష్టించాడు. షాహిద్ అఫ్రిది 398 వన్డేల్లో 351 సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 301 వన్డేల్లో 331 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ వెటరన్ క్రికెటర్ సనత్ జయసూర్య కూడా ఉన్నాడు. జయసూర్య 445 వన్డేల్లో 270 సిక్సర్లు బాదాడు.