Rohit Sharma Records: రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేయడంతో హిట్‌మ్యాన్ టెస్టుల్లో 4,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా తమ టెస్టు కెరీర్‌లో 4,000 పరుగులు చేయలేకపోయారు. శాస్త్రి 80 టెస్టుల్లో 3830 పరుగులు చేయగా, సిద్ధూ 51 టెస్టుల్లో 3202 పరుగులు చేశాడు.
100 టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో 4,000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా 9వ స్థానంలో నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే వరకు రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అంతకుముందు, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ బ్యాట్ మౌనంగానే ఉంది. భారత కెప్టెన్ 9 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. తన టెస్టు కెరీర్‌లో తొలి 1,000 పరుగులు సాధించడానికి రోహిత్ 33 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను 18 ఇన్నింగ్స్‌లలో తదుపరి 1,000 పరుగులు, 2001 నుంచి 23 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు, 26 ఇన్నింగ్స్‌లలో 3001 నుంచి 4000 పరుగులు సాధించాడు.
Another milestone with the bat for the #TeamIndia Captain 🙌
Rohit Sharma completes 4000 runs in Tests 👏👏
Follow the match ▶️ https://t.co/FUbQ3MhXfH #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/4Pi5HPnRMR
— BCCI (@BCCI) February 25, 2024
మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన వికెట్ నష్టపోకుండా 40 పరుగులు పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో విజయానికి భారత జట్టు 152 పరుగుల దూరంలో నిలిచింది. మూడో రోజు మూడో సెషన్ లో ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 46 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి, కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 353 పరుగులకు, భారత జట్టు 307 పరుగులకు ఆలౌటైంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్: జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..