Video: పాట పాడిన శ్రేయాస్.. డ్యాన్స్ ఇరగదీసిన శార్దుల్.. హల్దీ ఫంక్షన్‌లో రచ్చ చేసిన నూతన జంట.. వైరల్ వీడియో..

|

Feb 26, 2023 | 4:53 PM

Shardul Thakur Wedding: భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఫిబ్రవరి 27న పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లికి ముందు హల్దీ ఫంక్షన్ వీడియోలు వైరలవుతున్నాయి.

Video: పాట పాడిన శ్రేయాస్.. డ్యాన్స్ ఇరగదీసిన శార్దుల్.. హల్దీ ఫంక్షన్‌లో రచ్చ చేసిన నూతన జంట.. వైరల్ వీడియో..
Shardul Thakur Wedding
Follow us on

టీమిండియా ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం మైదానానికి దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జట్టుతో లేడు. శార్దూల్ తన కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ తన కాబోయే భార్య మిథాలీ పారుల్కర్‌ను ఫిబ్రవరి 27న వివాహం చేసుకోబోతున్నాడు. 2021లో మిథాలీతో శార్దూల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పెళ్లి కోసం ఇద్దరూ చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. దాదాపు 15 నెలల తర్వాత ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

శార్దూల్ ఠాకూర్ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన సన్నిహితులు కూడా చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పెళ్లిపై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి. వైరల్ కూడా అవుతున్నాయి. వివాహంలో భాగంగా మొదట హల్దీ వేడుక జరిగింది. ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

హల్దీలో డ్యాన్స్ ఇరగదీసిన శార్దుల్..

హల్దీ వేడుకలో పసుపు రంగు లెహంగాలో కనిపించిన మితాలీ.. పూల ఆభరణాలు ధరించి ఉంది. కాగా, ఈ వేడుకకు శార్దూల్ తెలుపు రంగును ఎంచుకున్నాడు. తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. పెళ్లికొడుకు కాబోతున్న శార్దూల్ తన హల్దీ వేడుకలో అదరగొట్టాడు. ధోల్, డీజే బీట్‌లకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. శార్దూల్, మిథాలీ ఒకరిపై ఒకరు పూలు విసురుకుంటూ కనిపించారు. ఈ జంట ప్రేమను అభిమానులు బాగా ఇష్టపడ్డారు. ఈ వివాహం మరాఠీ సంప్రదాయాల ప్రకారం జరుగుతోంది.

శార్దూల్ పెళ్లికి వచ్చిన శ్రేయాస్ అయ్యర్..


శార్దూల్ పెళ్లిలో అతని సన్నిహితులు కూడా కనిపించారు. ఈ వివాహానికి భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ముంబై క్రికెటర్ సిద్దేష్ లాడ్ కూడా హాజరయ్యారు. ఇద్దరూ తమ స్నేహితుడి కోసం పాటలు కూడా పాడారు. శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఉన్నాడు. మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో అతను పాల్గొననున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..