Team India Schedule: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది క్రీడారంగానికి అనుకోని నష్టం వాటిల్లింది. అత్యధిక ధనిక లీగ్ అయిన ఐపీఎల్ కూడా మధ్యలోనే ఆగిపోయి నిరవధిక వాయిదా పడింది. ప్లేయర్స్ అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే టీమిండియా ప్లేయర్స్ వచ్చే ఏడాది ఫుల్ బిజీ కానున్నారు. వరుసపెట్టి సిరీస్‌లు ఆడేందుకు వివిధ దేశాలకు పర్యటించనున్నారు. ఆ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా 2022లో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. మొదటిగా జనవరిలో వెస్టిండిస్ ఇండియా పర్యటనకు రానుంది. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటిస్తుంది. ఇక నెక్ట్స్ అన్నీ కరెక్ట్‌గా జరిగితే ఐపీఎల్ టోర్నమెంట్.. జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్ పయనం అవుతుంది. అక్కడ నుంచి వెస్టిండీస్ వెళ్తుంది. సెప్టెంబర్ నెలలో ఆసియా కప్.. ఆ తర్వాత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశీ సిరీస్‌ను టీమిండియా ఆడుతుంది. కాగా, టీమిండియా నవంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటిస్తుంది.
Also Read:
ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..
అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..