Pushpa 2: పుష్ప 2లో టీమిండియా స్టార్ క్రికెటర్.. అసలు విషయం ఏంటో తెలుసా?

|

Dec 11, 2024 | 9:35 AM

Krunal Pandya: పుష్ప 2లో విలన్‌గా నటించిన తారక్ పొన్నప్ప ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. ఇందుకు అసలు కారణం అతని లుక్. సినిమాలో చూపించిన అతని లుక్ హార్దిక్ పాండ్యా అన్నయ్య క్రికెటర్ కృనాల్ పాండ్యా లుక్‌తో సరిపోయింది. అందుకే సినిమాతో పాటు సోషల్ మీడియాలో వీరి చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Pushpa 2: పుష్ప 2లో టీమిండియా స్టార్ క్రికెటర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
Tarak Ponnappa Looks Like Krunal Pandya (2)
Follow us on

Tarak Ponnappa – Krunal Pandya: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా తొలి వారంలోనే కోట్లు వసూళ్లు చేస్తూ.. రూ. 1000 కోట్లు దిశగా సాగుతోంది. కానీ, ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అభిమానులు తప్పుగా భావించిన ఈ సినిమాలోని విలన్‌తో ఈ రచ్చ మొదలైంది. ఈ సినిమాలో విలన్ పేరు, అతని లుక్ గందరగోళానికి దారితీసింది. ఫ్యాన్స్ మాత్రం అతన్ని కృనాల్ పాండ్యాగా భావిస్తున్నారు. ఇలాంటి పోరపాటుకు కారణమైన వ్యక్తి పేరు తారక్ పొన్నప్ప. ఈయన అచ్చం కృనాల్ పాండ్యాలా కనిపిస్తున్నాడు.

పుష్ప 2లో కృనాల్ పాండ్యా?

తారక్ పొన్నప్ప లుక్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కృనాల్ పాండ్యా ఈ పాత్ర పోషించాడు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2లో కృనాల్ పాండ్యా అతిథి పాత్ర చేశాడంటూ చెబుతున్నారు.

తారక్ పొన్నప్పా లేక కృనాల్ పాండ్యా?

పుష్ప 2లో కొగటం బుగ్గారెడ్డి పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు. ఈ చిత్రంలో ఆయన కేంద్ర మంత్రి కొగటం వీర ప్రతాప్ రెడ్డికి మేనల్లుడిగా, కొగటం సుబ్బారెడ్డి కొడుకుగా నటిస్తున్నారు. సినిమాలోని ఓ సీన్‌లో అతని లుక్ బ్యాంగిల్స్, ముక్కుపుడక, నెక్లెస్, చెవిపోగులతో కనిపించింది. ఈ సినిమాలో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. సినిమాలో అతని లుక్ కృనాల్ పాండ్యాతో సరిపోతుంది. చాలా మంది ఫ్యాన్స్ కృనాల్ అతిథి పాత్రను పోషించాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప 2 కంటే ముందు తారక్ పొన్నప్ప దేవా పార్ట్ 1లో కూడా నటించాడు. దేవ్రా పార్ట్ 1లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. తారక్ పొన్నప్ప సూపర్ స్టార్ యష్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 లో దయా పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..