వరల్డ్‌కప్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే..18 ఫోర్లు, 14 సిక్సర్లతో 198 పరుగులు బాదేశాడు.. ఎవరంటే?

అతడొక జాతీయ జట్టు కెప్టెన్.. టీ20 ప్రపంచకప్‌లో తుస్సుమనిపించాడు.. జట్టు క్వాలిఫైయింగ్ స్టేజీలోనే నిష్క్రమించింది.. ఇతడు కెప్టెన్సీ వదులుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే కెప్టెన్‌గా దంచికొడుతున్నాడు.. ఎవరో తెలుసా?

వరల్డ్‌కప్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే..18 ఫోర్లు, 14 సిక్సర్లతో 198 పరుగులు బాదేశాడు.. ఎవరంటే?
Gladiators Team Captain
Follow us

|

Updated on: Nov 29, 2022 | 7:24 AM

రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఆడిన పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుతాలు చేయలేకపోయింది. ఈ జట్టు క్వాలిఫయర్స్ రౌండ్‌లోనే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. అలాగే జట్టు ఎర్లీ ఎగ్జిట్‌కు నికోలస్ పూరన్ బాధ్యత వహిస్తూ తన కెప్టెన్సీని వదులుకున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు పూరన్ మరో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తన బ్యాటింగ్ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. పూరన్ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు ఈ టోర్నీలో టాప్ రన్ గెట్టర్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు, ఈ లీగ్‌లో పూరన్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. అందులో అతడు రెండు అర్ధ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

అబుదాబితో జరిగిన మొదటి మ్యాచ్‌లో 33 బంతుల్లో అజేయంగా 77 పరుగులు చేసిన పూరన్.. ఆ తర్వాత నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 80 పరుగులు చేశాడు. అనంతరం మూడు, నాలుగో మ్యాచ్‌లో 7, 34 పరుగులు చేసిన పూరన్.. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తంగా 198 పరుగులు సాధించాడు. కాగా, T20 ప్రపంచకప్‌లో పూరన్ పేలవ ఫామ్‌ను కనబరిచాడు. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. ఇక వెస్టిండీస్ సూపర్-12కి చేరుకోలేకపోవడంతో పూరన్ కెప్టెన్సీని వదులుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..

Nicholas Pooran