AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఐపీఎల్‌లో ‘ఫ్లాప్ ప్లేయర్’.. ధోనికి వీరాభిమాని.. 12 ఫోర్లు, 12 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్

విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో రియాన్ పరాగ్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అస్సాం తరపున ఆడుతోన్న పరాగ్ జమ్మూకశ్మీర్‌పై..

IPL: ఐపీఎల్‌లో 'ఫ్లాప్ ప్లేయర్'.. ధోనికి వీరాభిమాని.. 12 ఫోర్లు, 12 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్
Riyan Parag
Ravi Kiran
|

Updated on: Nov 29, 2022 | 12:00 PM

Share

విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో రియాన్ పరాగ్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అస్సాం తరపున ఆడుతోన్న పరాగ్ జమ్మూకశ్మీర్‌పై 116 బంతుల్లో 174 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూకశ్మీర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగులు చేసింది. అనంతరం 351 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో భాగంగా బరిలోకి దిగిన అస్సాం 23 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ సాధించింది. జమ్మూకశ్మీర్ తరఫున హెనాన్ నజీర్(124), శుభమ్ ఖజురియా(120) సెంచరీలు సాధించగా, వారిద్దరి సెంచరీలను నీరుగారుస్తూ.. అస్సాం బ్యాటర్స్ పరాగ్(174), రిషభ్ దాస్(114) అద్భుతమైన సెంచరీలు బాదేశారు. పరాగ్ అయితే అటు బ్యాట్‌.. ఇటు బంతితో అద్భుతాలు చేశాడు.

మరోవైపు అస్సాం బౌలర్ల ముందు జమ్మూకశ్మీర్ బ్యాట్స్‌మెన్లు నిలవలేకపోయారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. ఆ జట్టులో నజీర్, శుభమ్ సెంచరీలతో పాటు రషీద్ హాఫ్ సెంచరీ చేయగా, వివ్రాంత్ శర్మ 34 పరుగులు చేశాడు. ఇక బ్యాట్‌తో రచ్చ చేసే ముందు పరాగ్ బంతితో అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ శుభమ్ పుండిర్‌ను ఖాతా తెరవకుండానే తన బౌలింగ్‌లో పెవిలియన్ చేర్చాడు. పరాగ్‌తో పాటు అవినోవ్, అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసి జమ్మూకశ్మీర్ జట్టు పతనంలో కీలక పాత్ర పోషించారు .

లక్ష్యాన్ని చేధించే క్రమంలో అస్సాం చాలా పేలవమైన ఆరంభాన్ని పొందింది. కునాల్ సైకియా, రాహుల్ హజారికా 45 పరుగుల వద్ద ఔటయ్యారు. దీనితో ఆ జట్టు 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పరాగ్, రిషబ్ దాస్‌లు బ్యాట్‌తో మంటలు పుట్టించారు. రెండు ఎండ్‌ల నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. పరాగ్ తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లతో 24 బంతుల్లో 100 పరుగులు దాటేశాడు. పరాగ్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. 98 బంతుల్లో 150 పరుగులు చేశాడు. 43వ ఓవర్లో యుధ్వీర్ వేసిన బంతికి పరాగ్ అవుటయ్యాడు. పెవిలియన్‌కు చేరుకునేలోపు పరాగ్ జట్టును దాదాపు విజయపథానికి చేర్చాడు. దీని తర్వాత సాహిల్ జైన్‌తో కలిసి రిషబ్ జట్టును గెలిపించాడు. రిషబ్ 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ధోని ఫ్యాన్: పరాగ్

టీ20ల్లో డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు చేయడం చాలా కష్టమైన పని. మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం. నెంబర్ 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పని చేయగలిగారు… మహేంద్ర సింగ్ ధోనీ ఇందులో మాస్టర్… మిగిలిన ఎవ్వరూ మాహీ భాయ్‌ని టచ్ కూడా చేయలేరు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..