T20 World Cup, Ind vs Eng Warm-Up, Live Streaming: ఇంగ్లండ్‌తో భారత్ ఢీ.. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగే అవకాశం

|

Oct 18, 2021 | 7:09 AM

అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, అంతకు ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

T20 World Cup, Ind vs Eng Warm-Up, Live Streaming: ఇంగ్లండ్‌తో భారత్ ఢీ.. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగే అవకాశం
Ind Vs Eng Warm Up Match
Follow us on

IND vs ENG: ఆదివారం ఒమన్ వర్సెస్ పాపువా న్యూ గినియా మధ్య జరిగిన మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత జట్టు అక్టోబర్ 24 న పాకిస్థాన్‌పై తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో టీమిండియా మొదటి వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది.

జట్టులోని ఆటగాళ్లందరూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో భాగంగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కోహ్లీ ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ సమస్య కాదు. కానీ, అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే టోర్నమెంట్‌లో వారి ప్రారంభ మ్యాచ్‌కు ముందు, వారు సరైన కాంబినేషన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా, ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం నిర్ధారించబడని ఆటగాళ్లకు భారత జట్టు మేనేజ్‌మెంట్ అవకాశాలు ఇవ్వాలనుకుంటుంది. అటువంటి ఆటగాళ్లకు బ్యాటింగ్ చేయడానికి లేదా బౌలింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయనుంది. తద్వారా వారి ప్రస్తుత ఫామ్ గురించి మెరుగైన ఆలోచన పొందేందుకు అవకాశం ఉంది.

టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఎప్పుడు జరుగుతుంది?

టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ సోమవారం (అక్టోబర్ 18) ఇంగ్లండ్‌తో జరగనుంది.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య దుబాయ్‌లోని దుబాయ్ క్రికెట్ స్టేడియంలో వార్మ్ అప్ మ్యాచ్ జరగనుంది.

టీ 20 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య వార్మప్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

టీ 20 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య వార్మప్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 7 గంటలకు జరుగుతుంది.

టీ 20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య వార్మప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?

టీమిండియా టీ 20 వరల్డ్ కప్ 2021 వార్మప్ మ్యాచ్‌లు హిందీ, ఇంగ్లీష్ వ్యాఖ్యానాలలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3) లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అలాగే డిస్నీ హాట్ స్టార్‌ యాప్‌లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా

ఇంగ్లండ్: ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టన్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ (కీపర్), జానీ బెయిర్‌స్టో (కీపర్), మొయిన్ అలీ, టామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

Also Read: T20 World Cup Records: పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే.. ట్రోఫీని గెలిపించడంలో మాత్రం విఫలం

T20 World Cup 2021: మొదటి ఫోర్ నుంచి హాఫ్ సెంచరీ వరకు.. టీ20 ప్రపంచ కప్‌లో తొలి రికార్డులు ఎలా ఉన్నాయంటే?