T20 World Cup: అలా జరిగితేనే సెమీస్‌కు పాక్.. మారిన లెక్కలు.. టీమిండియా దయ చూపించాలట.!

పాకిస్తాన్ విజయంతో గ్రూప్-బీ సెమీస్ లెక్కలు మారడమే కాదు..ఆ జట్టు తన సెమీఫైనల్ ఆశలను కూడా పదిలం చేసుకుందని చెప్పాలి.

T20 World Cup: అలా జరిగితేనే సెమీస్‌కు పాక్.. మారిన లెక్కలు.. టీమిండియా దయ చూపించాలట.!
Pakistan Team

Updated on: Nov 03, 2022 | 7:00 PM

టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్-బీలో భాగంగా సిడ్నీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-బీ సెమీస్ లెక్కలు మారడమే కాదు.. పాకిస్తాన్ తన సెమీఫైనల్ ఆశలను కూడా పదిలం చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే ఆ గ్రూప్ నుంచి టీమిండియా దాదాపుగా సెమీఫైనల్ ప్లేస్‌ను ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. మరి పాక్ సెమీస్ చేరేందుకు లెక్కలు ఏం చెబుతున్నాయంటే..

పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలబడుతుంది. ఈ మ్యాచ్‌ నవంబర్ 6వ తేదీన జరుగుతుంది. ఇందులో పాక్ విజయం సాధించడమే కాదు.. నెట్ రేట్‌ కూడా తగ్గకుండా చూసుకోవాలి. అలాగే టీమిండియా లీగ్ స్టేజిలోని లాస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో ఓటమిని చవి చూడాలి. మరోవైపు దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ భారీ విజయాన్ని నమోదు చేయాలి. ఇవన్నీ జరిగితేనే పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుతుంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.

కాగా, సఫారీలపై పాక్ విజయం సాధిస్తే సరిపోదని.. ఇతర జట్ల విజయావకాశాలుపై వారి సెమీస్ పోటి ఆధారపడి ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాబర్ సేన టోర్నమెంట్ నుంచి అస్సాం వెళ్లడం ఖాయమని అంటున్నారు. మరోవైపు పాక్ ఫ్యాన్స్ మాత్రం చివరి మ్యాచ్‌లో ఓడిపోయి.. టీమిండియా తమ జట్టుపై దయ చూపించాలంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.