సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో ఊహించని మార్పులు..?

T20 World Cup 2026 Schedule Change: ప్రస్తుతం టీమిండియా, శ్రీలంక టీంల పరిస్థితి ఒకేలా ఉంది. ఈ రెండు జట్లు సెమీస్ చేరకుండానే తప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో మార్పులు చేయనుంది.

సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో ఊహించని మార్పులు..?
T20 World Cup 2026 Super 8 Group A & Group B

Updated on: Feb 24, 2026 | 8:12 AM

T20 World Cup 2026 Schedule Change: టీ20 వరల్డ్ కప్ 2026 మధ్యలో ఐసీసీ సెమీఫైనల్ మ్యాచ్‌ల వేదికలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో టోర్నమెంట్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం సూపర్–8 మ్యాచ్‌లు కొనసాగుతుండగా, అనంతరం రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరగనున్నాయి. సెమీఫైనల్ వేదికలు ఏ జట్లు అర్హత సాధిస్తాయన్నదానిపై ఆధారపడి మారే విధంగా ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో ఏమేం మార్పులు..?

భారత్–శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ వేదికల కోసం హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నారు. ఐసీసీ తాజా గైడ్‌లైన్స్ ప్రకారం, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంకు కీలక పాత్ర ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శ్రీలంక సెమీఫైనల్‌ను భారత్‌లో ఆడాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో శ్రీలంకకు హోమ్ గ్రౌండ్‌లో సెమీఫైనల్ ఆడే అవకాశం ఏర్పడింది.

ప్రత్యేకంగా తొలి సెమీఫైనల్ వేదిక ‘ఫ్లోటింగ్’గా ఉంచారు. అంటే పరిస్థితులను బట్టి ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లేదా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగవచ్చు. రెండో సెమీఫైనల్ సాధారణంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరగే అవకాశముంది.

పాకిస్థాన్ అర్హత సాధిస్తే ఏమవుతుంది?

ఐసీసీ ప్రకారం, పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ మార్చి 4న కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరకపోతే, శ్రీలంక అర్హత సాధించిన పక్షంలో తమ సెమీఫైనల్‌ను కొలంబోలోనే ఆడుతుంది (ప్రత్యర్థి భారత్ కాకపోతే). టోర్నమెంట్‌కు ముందు ఐసీసీ పాకిస్థాన్ సెమీఫైనల్/ఫైనల్ మ్యాచ్‌లకు శ్రీలంకకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పింది. తాజా మార్గదర్శకాలతో శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ అవకాశం కూడా జతైంది.

భారత్ సెమీఫైనల్ కోలంబోకు షిఫ్ట్ అవుతుందా?

భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే సాధారణంగా రెండో సెమీఫైనల్‌ను ముంబై వాంఖడే స్టేడియంలో ఆడే అవకాశం ఉంది. అయితే భారత్–పాకిస్థాన్ సెమీఫైనల్ పడితే, భద్రతా/లాజిస్టిక్స్ కారణాల దృష్ట్యా ఆ మ్యాచ్‌ను కొలంబోకు షిఫ్ట్ చేసే అవకాశముంది. మరోవైపు పాకిస్థాన్, శ్రీలంక రెండూ సెమీఫైనల్‌కు అర్హత సాధించకపోతే, తొలి సెమీఫైనల్ కోల కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, రెండోది ముంబైలో జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us