T20 World Cup2022: యూఏఈ టీ20 ప్రపంచకప్ తరువాత తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. ఐపీఎల్ 2022 నుంచి మళ్లీ క్రికెట్‌లోకి రానున్నాడు. హార్దిక్‌ను అహ్మదాబాద్ జట్టు కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అలాగే ఆ జట్టు రషీద్ ఖాన్, శుభమాన్ గిల్‌లను కూడా చేర్చుకుంది. ఈసారి ఐపీఎల్‌లో 8 జట్లకు బదులు 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి.
అదే సమయంలో, ఈ సంవత్సరం టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్లో జరగనుంది. భారత్, పాకిస్థాన్‌లు మరోసారి అదే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. పాండ్యా గాయం కారణంగా 2021లో బౌలింగ్ చేయలేకపోయాడు. బ్యాట్స్‌మెన్‌గా కూడా విఫలమయ్యాడు. ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ మాట్లాడుతూ, ‘టి 20 ప్రపంచకప్ సమయంలో నా సన్నాహాలు పూర్తిగా సిద్ధమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శిక్షణలు, ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాను. IPL 2022 ప్రపంచకప్‌నకు సిద్ధం కావడానికి నాకు వేదికను అందిస్తుంది. భారత జట్టుకు, ప్రపంచకప్‌కు నా పూర్తి సన్నద్ధత కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కానుంది అని తెలిపాడు.
ఐపీఎల్‌లో తొలిసారిగా..
హార్దిక్ పాండ్యా ముంబై కాకుండా వేరే జట్టుతో ఐపీఎల్‌లో ఆడనున్నాడు. 2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌లో కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరఫున మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అతడిని ముంబై ఇండియన్స్ రిటైన్ చేయలేదు. అతను తొలిసారిగా మరో జట్టు తరఫున ఆడబోతున్నాడు. ఈసారి అతని కెప్టెన్సీని కూడా పరీక్షించాల్సి ఉంటుంది. తన ఫేవరెట్ కెప్టెన్ ధోనీకి వ్యతిరేకంగా కూడా అతను ఆడనున్నాడు.
Also Read: T20I Cricket: టీ20ఐ హ్యాట్రిక్ లిస్టులో 26 మంది బౌలర్లు.. ఈ నలుగురు మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే?
IPL 2022: రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ లిస్టులో చేరిన తొలి జట్టు.. అదేంటంటే?