టీ20 ప్రపంచకప్ 2022 లో టీమ్ ఇండియా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. కాగా, తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ టీంతో తలపడాల్సి ఉంది. అయితే రెండో సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో రెండో సెమీ-ఫైనల్‌కు ముందు అడిలైడ్ ఓవల్‌లో వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబర్ 10న అడిలైడ్ ఓవల్‌లో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అభిమానులకు చాలా మంచి శుభవార్తే అని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ జరిగే రోజు అడిలైడ్‌లో మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
ఇంతకుముందు భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ సూపర్-12 గ్రూప్ బిలో ఇక్కడ జరిగింది. ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌లో ఓవర్‌ను 14 ఓవర్లకు కుదించారు. అడిలైడ్ ఓవల్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత సెమీ ఫైనల్‌లో కూడా వర్షం కురిసి మ్యాచ్ సరదాను పాడు చేస్తుందా అని అభిమానులు చాలా ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ అభిమానులకు శుభవార్త అందించింది. మ్యాచ్ రోజున వర్షం వచ్చే సూచన లేదని తెలిపింది.
వర్షం పడే అవకాశం ఉన్నా.. రెండు సెమీ ఫైనల్స్‌కు రిజర్వ్ డేస్ అందుబాటులో ఉంటాయి. అంటే వర్షం కారణంగా నిర్ణీత రోజున మ్యాచ్ ఫలితం రాకపోతే మరుసటి రోజే మ్యాచ్ పూర్తి చేసుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2022 అన్ని మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. డిస్నీ + హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..