IND vs ENG T20 WC Semi Final: సెమీస్‌లో టాస్ గెలిస్తే.. టీమిండియా ఓడినట్లే.. అడిలైడ్ రికార్డులే అందుకు సాక్ష్యం..

IND vs ENG T20 WC Semi Final: T20 ప్రపంచ కప్ 2022 రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు టాస్ పెద్ద సమస్యగా మారనుంది.

IND vs ENG T20 WC Semi Final: సెమీస్‌లో టాస్ గెలిస్తే.. టీమిండియా ఓడినట్లే.. అడిలైడ్ రికార్డులే అందుకు సాక్ష్యం..
IND vs ENG: Oval Stadium

Updated on: Nov 09, 2022 | 6:25 AM

టీ20 ప్రపంచ కప్ 2022లో, భారత జట్టు తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ గురువారం, నవంబర్ 10న అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్‌లో అడిలైడ్ ఓవల్‌లో ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్‌లు జరిగాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిన జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిస్తే భారత జట్టుకు చాలా కష్టంగా మారనుంది.

ఇరు జట్లకు ఇబ్బంది..

అడిలైడ్ ఓవల్‌లోని ఈ పరిస్థితి రెండు జట్లకు తలనొప్పిగా మారింది. ప్రతీ జట్టు మొదట టాస్ గెలిచి, పరిస్థితిని బట్టి ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఈ అడిలైడ్ ఓవల్ ఫిగర్ చూసిన తర్వాత టాస్ గెలవకూడదని ఇరు జట్ల కెప్టెన్లు అనుకుంటున్నారట. ఇక టాస్ గెలిచి ఏ జట్టు నిర్ణయం తీసుకుంటుందో మ్యాచ్ రోజు మాత్రమే తెలుస్తుంది.

మరోవైపు న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌లు తమ సెమీఫైనల్‌ మ్యాచ్‌ని ఒకరోజు ముందుగానే ఆడాల్సి ఉంది. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 9, బుధవారం పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అదే సమయంలో నవంబర్ 13న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

భారత్‌-ఇంగ్లండ్‌ల పరిస్థితి..

ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అద్భుతమైన లయలో కనిపించింది. సూపర్-12 గ్రూప్ దశలో 5 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 4 గెలిచింది. పాకిస్థాన్‌ను ఓడించి విజయంతో టోర్నీని ప్రారంభించింది.

అదే సమయంలో, ఇంగ్లాండ్ 5 మ్యాచ్‌లలో 3 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇంగ్లండ్ కూడా ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి విజయంతో టోర్నీని ప్రారంభించింది. అయితే డక్‌వర్త్ లూయిస్ నిబంధన కారణంగా ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..